Shubman Gill : ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. బుధవారం (ఏప్రిల్ 8, 2026) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నారు.

New Update
shubhman gill

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. బుధవారం (ఏప్రిల్ 8, 2026) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నారు. గుజరాత్ టైటాన్స్ తరపున ఐపీఎల్‌లో 2500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా గిల్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.

ఈ ఘనత సాధించడానికి గిల్‌కు ఈ మ్యాచ్‌కు ముందు కేవలం 12 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఢిల్లీ స్పిన్నర్ అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్ ఐదో బంతికి ఫోర్ కొట్టడం ద్వారా గిల్ ఈ మైలురాయిని చేరుకున్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్‌లోకి ప్రవేశించిన మొదటి సీజన్ (2022) నుంచే గిల్ ఆ జట్టులో అంతర్భాగంగా ఉన్నారు. అప్పటి నుండి నిలకడగా రాణిస్తూ, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఇప్పుడు ఈ భారీ స్కోరును నమోదు చేశారు.

4 వికెట్ల నష్టానికి 210 పరుగులు 

ఇక మ్యాచ్ విషమానికి వచ్చేసరికి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు శివమెత్తారు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతంగా ఆడి 70 పరుగులతో జట్టును ముందుండి నడిపించగా, స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ (52) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ కేవలం కొద్ది బంతుల్లోనే 55 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టి ఫరవాలేదనిపించగా, కుల్‌దీప్ యాదవ్, లుంగి ఎంగిడి చెరో వికెట్ తీశారు. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ కొండంత స్కోరును ఎలా ఛేదిస్తుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు