/rtv/media/media_files/2025/03/03/RXO0ExSqgRGejfVkAilX.jpg)
టీమిండియా స్టార్ ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకరు. తన అద్భుతమైన ఆటతో చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ సోదరి గురించి చాలా తక్కువమందికి తెలుసు. శ్రేయాస్ అయ్యర్ చెల్లెలు పేరు శ్రేష్టా అయ్యర్. శ్రేష్టా అయ్యర్ ఏప్రిల్ 29న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రోహిణి, సంతోష్ అయ్యర్ఈమె కొరియోగ్రాఫర్ .అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా .. ఈమెకు103k కంటే ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. ఈమెకు ఇంకా పెళ్లి కాలేదు.
Also Read : టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
శ్రేష్టా కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్ లో చదివి ముంబైలోని రామ్ నారాయణ్ రుయా కాలేజీ నుండి పట్టభద్రురాలైంది. చాలా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఈమె ఇటీవల ఓ ఐటమ్ సాంగ్ లో మెరిసింది. 'సర్కారి బచ్చా' చిత్రంలోని 'అగ్రీమెంట్ కార్లే' అనే ఐటమ్ సాంగ్‌లో శ్రేష్ఠ అయ్యర్ రెచ్చిపోయి మరి డ్యాన్స్ చేసింది. ఈ పాటలో రుస్లాన్ ముంతాజ్, అన్య తివారీలతో కలిసి ఆమె స్టెప్పులు వేసింది.
Also read : SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
ఐటెం సాంగ్ అందుకే చేశా
ఈ పాటలో ఆమె చేసిన కిల్లింగ్ స్టెప్స్, మూవ్ మెంట్ లు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. అయితే ఐటెం సాంగ్ చేయడానికి గల కారణాన్ని ఈమె వెల్లడించారు. ముందుగా ఈ పాటకు కొరియోగ్రఫీ చేయమని తననే అడిగారని.. పాట నచ్చడం, డైరెక్టర్ కూడా నన్నే ఇందులో నటించమని అడగారని తెలిపింది. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని.. స్క్రీన్ పైన కనిపిస్తే ఇంకా బాగుంటుందని అనిపించిందని శ్రేష్టా అయ్యర్ చెప్పుకొచ్చారు. 'సర్కారి బచ్చా' చిత్రం 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రాన్ని ఫ్లయింగ్ బర్డ్ పిక్చర్స్ పతాకంపై డానిష్ సిద్ధిఖీ నిర్మించారు. దీనికి సూర్యకాంత్ త్యాగి, డానిష్ సిద్ధిఖీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.