ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకున్న దొమ్మరాజు గుకేశ్ ప్రైజ్ మనీకి భారీగా గండి పడింది. తమిళనాడుకు చెందిన గుకేశ్ దొమ్మరాజు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన డిఫెండింగ్‌ఛాంపియన్ డింగ్ లిరెన్‌తో జరిగిన చివరి పోరులో గుకేశ్ విజయం సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ సొంతం చేసుకోగా.. ఆయన తర్వాత ఈ ఛాంపియన్‌షిప్‌ను దక్కించుకున్న రెండో భారత చెస్ ప్లేయర్‌గా గుకేశ్ రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో గుకేశ్‌కు 13.5 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 11.45 కోట్ల ప్రైజ్ మనీ రానుంది. అయితే అందులో రూ.4.67 కోట్లు పన్ను రూపంలో కట్ అవుతుంది.
READ ALSO ; సోనియా గాంధీ తీసుకున్న నెహ్రూ లేఖలు అప్పగించండి: కేంద్రం
Also Read: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు
దాదాపు 40 శాతం కంటే ఎక్కువే. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆర్తిక మంత్రి నిర్మాలా సీతారామన్‌పై ఫైర్ అవుతున్నారు. గవర్నమెంట్ ట్యాక్స్ విధానంపై సెటైర్లు వేస్తున్నారు. గుకేశ్ ప్రైజ్‌మనీ దాదాపు రూ.11కోట్లు అయితే అతను 30శాతం ట్యాక్స్స్లాబ్ కిందకు వస్తాడు. ఆదాయపు పన్ను శాఖ కాలిక్యులేటర్ ప్రకారం.. ఆ పన్ను మొత్తంసుమారు రూ.3 కోట్ల 28 లక్షలు. దీనికి సర్ఛార్జ్మరో రూ. కోటి 30 లక్షలు. ఈ మొత్తానికి సెస్ కలుపుకుంటే గుకేశ్ కు వచ్చిన దాంట్లో దాదాపు రూ.4.67 కోట్ల వరకు ఆర్థిక శాఖకు వెళ్తోంది.