/rtv/media/media_files/2026/05/29/supreme-court-2026-05-29-15-13-49.jpg)
భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు సుప్రీం కోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో ఆమె పాల్గొనేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అయితే ఇదే సమయంలో వినేష్ ఫోగట్‌కు కోర్టు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని వ్యాఖ్యలను తాము పూర్తిగా సమర్థించడం లేదన్న సుప్రీం కోర్టు.. డోపింగ్ నిబంధనల పాటించకపోవడంపై మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Today, On 29th May, The Supreme Court allowed wrestler Vinesh Phogat to participate in the May 30 Asian Games selection trials. The bench told her, “We are not stopping, you go and participate,” granting her clear permission to compete in the process.
— LawChakra (@LawChakra) May 29, 2026
Read More At:… pic.twitter.com/vuDVS7fgAA
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన బెంచ్ శుక్రవారం విచారించింది. మే 30 నుంచే సెలక్షన్ ట్రయల్స్ ప్రారంభం కానుండటంతో.. చివరి నిమిషంలో ఈ ప్రక్రియను అడ్డుకోవడం సరికాదనే ఉద్దేశంతో వినేష్ ఫోగట్ పోటీ పడేందుకు కోర్టు అనుమతించింది. అయితే విచారణ సమయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు తప్పుబట్టింది.
అందరూ పాటించాల్సిందే
రెజ్లింగ్ సమాఖ్య నియమాలు అందరు రెజ్లర్లకు సమానంగా వర్తించినప్పుడు, అది వినేష్‌ను పక్కన పెట్టడానికే తెచ్చిన పాలసీ అని హైకోర్టు ఎలా అంటుందని ప్రశ్నించింది. కేవలం మాతృత్వం, లింగ వివక్ష అనే కోణాలను బేస్ చేసుకుని క్రీడా విభాగాల నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దేశం కోసం ఆడే అథ్లెట్లకు దేశమే మొదటి ప్రాధాన్యత కావాలని కోర్టు వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని పేర్కొంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఇలాంటి యాంటీ డోపింగ్ రూల్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
Follow Us