నాకు ముందే మెసేజ్ వచ్చింది.. ఉప్పల్ సెంచరీపై సంజూ టాప్ సీక్రెట్!

బంగ్లాదేశ్ తో టీ20 సెంచరీపై భారత బ్యాటర్ సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బయటపెట్టాడు. 47 బంతుల్లోనే 111 పరుగులు చేసిన సంజూ.. మేనేజ్‌మెంట్‌ సపోర్ట్‌తోనే ఇది సాధ్యమైందన్నాడు. సూర్య, గంభీర్, అభిషేక్ ముందే ఓపెనర్ గా ప్రిపేర్ కావాలని చెప్పారన్నాడు.

New Update
drter

Sanju Samson: టీ20 సెంచరీపై భారత బ్యాటర్ సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బయటపెట్టాడు. ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్ తో (Bangladesh) జరిగిన మూడో టీ20లో 47 బంతుల్లోనే 111 పరుగులు సాధించి ఔరా అనిపించిన సంజూ.. మేనేజ్‌మెంట్‌ సపోర్ట్‌తోనే ఈ ఫీట్ సాధ్యమైందని చెప్పాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజూ.. మొదటి రెండు మ్యాచుల్లో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా సక్సెస్ కాలేదని చెప్పాడు. 

ఇది కూడా చదవండి: TS: రేవంత్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్.. మూసీ కూల్చివేతలపై స్టే!

మేనేజ్‌మెంట్‌ కమ్యూనికేషన్‌ సపోర్టుతోనే..

నాకు మేనేజ్‌మెంట్‌ క్లిష్టమైన పరిస్థితుల్లో అండగా నిలిచింది. సిరీస్‌ ప్రారంభానికి మూడు వారాల ముందే కోచ్‌ గౌతమ్‌ గంభీర్ (Guatam Gambhir), కెప్టెన్ సూర్యకుమార్ (Suryakumar Yadav), సపోర్ట్ కోచ్ అభిషేక్ నాయర్ నుంచి మెసేజ్ వచ్చింది. బంగ్లాతో సిరీస్‌లో ఓపెనింగ్ చేయాలని సూర్య, గంభీర్, అభిషేక్ చెప్పారు. ఇందుకు ప్రాక్టీస్ చేసుకునేందుకు సమయం ఇచ్చారు. దీంతో రాజస్థాన్‌ రాయల్స్‌ అకాడమీకి వెళ్లి కొత్త బంతితో ప్రాక్టీస్ చేశా. అదే నాకు సాయపడింది. మేనేజ్‌మెంట్‌తో కమ్యూనికేషన్‌ నాకు చాలా ఉపయోగపడింది. నా సామర్థ్యం ఏంటో కూడా నాకు బాగా తెలుసు. మంచి ప్రదర్శనతో జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేం కాదు' అంటూ చెప్పకొచ్చాడు. ఇక భారత జట్టులో ప్రతి స్థానంలో పోటీ ఏర్పడిందని, కానీ దేశం కోసం ఆడేటప్పుడు ఒత్తిడి ఉంటుందన్నాడు సంజూ శాంసన్. 

ఇది కూడా చదవండి: వామ్మో ఈ ఆంటీ నక్క తోక తొక్కింది.. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది!

11 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగిన సంజూ..

అక్టోబర్ 12న ఉప్పల్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి 133 పరుగుల భారీ తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ కైవసం చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగులు చేయగా బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో హిర్దోయ్ (63), లిటన్ దాస్ (42) మాత్రమే టాప్ స్కోర్ చేశారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, మయాంక్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ తీశారు. భారత బ్యాటర్లు సంజూ శాంసన్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 111 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులు బాది 75 పరుగులు చేశాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ 34, హార్దిక్ పాండ్య 47 పరుగులు చేశారు. 

ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి నో టోల్‌ ఫీజు!

ఇది కూడా చదవండి: మా పరిచయం వ్యక్తిగత అనుబంధంగా మారింది: ఎన్. చంద్రశేఖరన్ ఎమోషనల్

Advertisment
Advertisment
తాజా కథనాలు