/rtv/media/media_files/2025/02/09/9clDPRSVxgvKoacssO6o.jpg)
Rohith Sharma Century
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు. రోహిత్‌కు వన్డేల్లో ఇది 32వ సెంచరీ. దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. గత కొంతకాలంగా మ్యాచుల్లో విఫలవుతూ వస్తున్న రోహిత్ శర్మ.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చేశాడు. చాలాకాలం తర్వాత హిట్‌మ్యాన్ తన స్టైల్లో థండర్ షాట్లతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కూడా చేశాడు.ఆదిల్ రషీద్ వేసి 25.2 ఓవర్‌కు సిక్స్ కొట్టి సెంచరీ చేశాడు.
Also Read: పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి : పాక్ ప్రధాని
వన్డే మ్యాచుల్లో అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్స్ జాబితా కూడా రోహిత్ (337) రెండో ప్లేస్‌కు చేరుకున్నారు. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్(331)ను రోహిత్ వెనక్కి నెట్టాడు. ఇక వన్డేల్లో 351 సిక్స్‌లతో పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ (49) మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండుల్కర్ 100 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా.. విరాట్ కొహ్లీ 81 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.
Also Read: ఈడ్చి కొట్టిన పాక్ బ్యాట్స్మెన్... న్యూజిలాండ్ ఆటగాడికి తీవ్ర గాయం!
ఈ మ్యాచ్‌తో రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసి ప్లేయర్స్‌లో టాప్ 10 జాబితాలోకి వచ్చేశాడు. రాహుల్ ద్రవిడ్ (318 ఇన్నింగ్స్, 10,889)ను దాటేసిన రోహిత్ పదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ 259 ఇన్నింగ్స్‌లో 10,962 పరుగులతో ఉన్నాడు. అంతేకాదు వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండుల్కర్ (18,426 పరుగులు), విరాట్ కొహ్లీ (13,906), సౌరభ్ గంగూలీ (11,363) వరుసగా మొదటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.