/rtv/media/media_files/2025/03/09/Dh7b51hiyvhXl5h3d19P.jpg)
Ravindra Jadeja
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రిటైర్ అవుతారని నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దానికి ముఖ్య కారణం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కివీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో జడేజా తన స్పెల్ తర్వాత కాస్త ఎమోషనల్ అయ్యాడు. వెంటనే ఆయన్ను విరాట్ కోహ్లీ కౌగిలించుకొని బాధగా కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
Why does this hug feel like #jadeja will announce his retirement after today's match pic.twitter.com/4fd7qPWnZV
— Kt Kartik Patel (@KtKartikPatel1) March 9, 2025
దీంతో ఇప్పటికే T20ల నుంచి తప్పుకున్న జడేజా ఇప్పుడు వన్డేల నుంచి కూడా రిటైర్ అవుతారని తెలుస్తోంది. కాగా ఇటీవల రవిచంద్రన్ అశ్విన్, స్మిత్‌ను హగ్ చేసుకున్న తర్వాత అతడు రిటైర్ అయ్యాడు. అదే సీన్ ఇప్పుడు ఇక్కడ కూడా కనిపించింది. దీంతో జడేజా కూడా ఈ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
రోహిత్ రికార్డు
ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ అత్యంత రసవత్తరంగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్‌కు దిగింది. ఈ క్రమంలోనే రోహిత్ అరుదైన రికార్డును సమం చేశాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా టాస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అతడు వన్డే క్రికెట్‌లో వరుసగా 12వ సారి టాస్‌ను కోల్పోయాడు.
ఈ తరుణంలోనే విండిస్ స్టార్ ప్లేయర్ బ్రయన్ లారా (1998-99) సీజన్‌లో వరుసగా 12 సార్లు టాస్ కోల్పోయిన రికార్డును రోహిత్ సమం చేశాడు. కాగా వన్డే ఫార్మేట్లలో టీమిండియా అదృష్టం వెక్కిరించడం ఇది 15వ సారి కావడం గమనార్హం. అయితే ఇలా టాస్ ఓడిపోవడం 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ప్రారంభమైంది. అప్పుడు అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా vs భారత్ మధ్య పోరుతో ఈ పరంపర స్టార్ట్ అయింది.
అప్పటి నుంచి భారత్ వరుసగా టాస్ ఓడిపోతూ వస్తోంది. దీంతో ఈ లిస్ట్‌లో మొదటిగా లారా ఉండగా.. ఇప్పుడు అతడితో పాటే రోహిత్ చేరాడు. వీరిద్దరూ ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నారు. ఇదే జాబితాలో తర్వాతి వరుసలో నెదర్లాండ్స్ ప్లేయర్ పీటర్ బారెన్ ఉన్నాడు. అతడు వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయాడు.