/rtv/media/media_files/2025/03/30/65FRJsczIQsPj8V07TtW.jpg)
csk-vs-dc
గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 9వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నితీశ్ రాణా(81), రియాన్ పరాగ్ (37), సంజుశాంసన్ (20), హిట్ మయర్ (19) ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మొదటి బంతికే ఫోర్ బాది మంచి ఊపుమీద కనిపించిన ఓపెపర్ జైస్వాల్ (4) వెంటనే ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణాతో ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు సంజుశాంసన్. ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేశారు. ఈ క్రమంలోనే 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
రియాన్ పరాగ్ భారీ షాట్లతో
మంచి ఊపుమీదున్న రాజస్థాన్ కు నూర్‌అహ్మద్ బిగ్ షాక్ ఇచ్చాడు. అతని బౌలింగ్ లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సంజు శాంసన్ (20) వెనుదిరిగాడు. దీంతో వీరి 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరోపక్కా నితీశ్ రాణా మాత్రం ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో 81 పరుగుల వద్ద.. భారీ షాట్ కొట్టేందుకు ముందుకు వచ్చి ధోనీ స్టంపింగ్ కు దొరికిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు నితీశ్ రాణా. అనంతరం ధ్రువ్ జురేల్ (3), హసరంగ (4) వెనువెంటనే ఔట్ అయ్యారు. దీంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. చివర్లో రియాన్ పరాగ్ (37) భారీ షాట్లతో అలరించడంతో రాజస్థాన్ భారీ చేసింది. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీయగా.. మథీష పతిరానా మూడు వికెట్లు తీశారు.
#IPL2025 #RRvCSK #RRvsCSK
— Express Sports (@IExpressSports) March 30, 2025
INNINGS BREAK
Nitish Rana scores 81 but Rajasthan Royals' batting collapse restricts them to 182/9 vs Chennai Super Kings
LIVE:https://t.co/1GqwQK5eUQ
Also Read : DC vs SRH : ఉగాది రోజున ఊచకోత.. సన్‌రైజర్స్కు రెండో ఓటమి!