/rtv/media/media_files/2026/02/15/bumrah-2026-02-15-21-14-58.jpg)
కొలంబో వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ పోరులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో బెంబేలెత్తిస్తున్నారు. రెండో ఓవర్లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి పాక్ నడ్డి విరిచారు.
Boom boom bumrah 🔥🔥 #INDvsPAKpic.twitter.com/xi7iddJ3PP
— MrFantus (@Mrfantus09) February 15, 2026
భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా వేసిన మొదటి ఓవర్లోనే ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (0)ను అవుట్ చేసి భారత్ శుభారంభం ఇచ్చింది. ఆ వెంటనే రెండో ఓవర్లో బంతిని అందుకున్న బుమ్రా తన విశ్వరూపం చూపించారు. ఓవర్ మొదటి బంతికే సిక్సర్ కొట్టిన సైమ్ అయూబ్ (6)ను మరుసటి బంతికే అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశారు. అదే ఓవర్ చివరి బంతికి పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (4)ను పెవిలియన్ పంపి పాకిస్థాన్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు.
కేవలం రెండు ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. ప్రస్తుతం క్రీజులో స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ ఉన్నారు.
Follow Us