పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!

పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం ఎదురైంది. హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఒక్కరు కూడా అమ్ముడుపోలేదు.  డ్రాఫ్ట్‌లో మొత్తం 45 మంది పురుష ఆటగాళ్లు, 5 మంది మహిళా క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా వీరిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.

New Update
pak cricketers

పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం ఎదురైంది. హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఒక్కరు కూడా అమ్ముడుపోలేదు.  డ్రాఫ్ట్‌లో మొత్తం 45 మంది పాక్  పురుష ఆటగాళ్లు, 5 మంది మహిళా క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా వీరిలో ఒక్కరిపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. గత సీజన్‌లో అత్యధిక ధర పలికిన నసీమ్ షాను కూడా పట్టించుకోలేదు. ఇక అయూబ్, ఇమాద్ వసీం, హసన్ అలీ, మహ్మద్ హస్నైన్‌లను కూడా తిరిగి తీసుకోలేదు. 

భారత్ పెట్టుబడులే కారణం?  

కాగా మొత్తం 8 జట్లలో నాలుగింటిలో భారత్ పెట్టుబడులు ఉండటం వల్ల వారిని కొనుగోలు చేయలేదని తెలుస్తోంది. దీనికి తోడు పాక్ ఆటగాళ్లు కూడా ఫామ్‌లేమితో ఇబ్బంది పడటం మరో కారణంగా తెలుస్తోంది.  టోర్నమెంట్ నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పురుషుల క్రికెటర్లకు ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. హండ్రెడ్‌ లీగ్‌లో పాక్‌ ఆటగాడు ఉసామా మిర్‌ అత్యధికంగా 13 మ్యాచ్‌లు ఆడగా..  హరీస్‌ రౌఫ్‌ 12, ఇమాద్‌ వసీం 10, మహ్మద్‌ అమిర్‌ 6, షాహీన్‌ అఫ్రిది 6, మహ్మద్‌ హస్నైన్‌ 5, జమాన్‌ ఖాన్‌ 5, షాదాబ్‌ ఖాన్‌ 3, వాహబ్‌ రియాజ్‌ 2 మ్యాచ్‌లు ఆడారు. ఇక అటు 2008 ఉగ్రవాద దాడుల తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్ళు ఐపీఎల్‌లో పాల్గొనడం లేదు. 

జేమ్స్‌ ఆండర్సన్‌కు చుక్కెదురు 

ఇక హండ్రెడ్‌ లీగ్‌-2025 డ్రాఫ్ట్‌లో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, ఆఫ్ఘనిస్తాన్‌ యంగ్ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ లు ఏకంగా జాక్‌పాట్‌ కొట్టారు. ఈ ఇద్దరు ఊహించని ధర 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. బ్రేస్‌వెల్‌ను గత సీజన్‌ రన్నరప్‌ సధరన్‌ బ్రేవ్‌ దక్కించుకోగా.. నూర్‌ అహ్మద్‌ను మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ సొంతం చేసుకుంది. మరోవైపు ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌కు చుక్కెదురైంది. అతన్ని డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

Also read :  హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs MI: టాస్ గెలిచిన ముంబై.. సన్‌రైజర్స్ బ్యాటింగ్

ఇండియన్స్ ప్రీమియర్స్ లీగ్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు టాస్ వేయగా.. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో SRH బ్యాటింగ్‌కు దిగనుంది.

New Update
SRH vs MI:

SRH vs MI: Photograph: (SRH vs MI:)

ఇండియన్స్ ప్రీమియర్స్ లీగ్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు టాస్ వేయగా.. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో SRH బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఇది 41వ మ్యాచ్‌. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి మధ్య ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు జరిగ్గా.. అందులో ముంబయి 14 మ్యాచ్‌ల్లో గెలిచింది. అదే సమయంలో సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అంతేకాకుండా ఇరుజట్ల మధ్య గత ఐదు మ్యాచ్‌లు జరగ్గా.. ముంబయి ఇండియన్స్ ఏకంగా నాలుగు మ్యాచ్‌లు విజయం సాధించింది. 

ముంబయి తుది జట్టు

రికిల్‌టన్ (వికెట్‌కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, విఘ్నేశ్ పుతుర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

Advertisment
Advertisment
Advertisment