PAK vs NZ : ఛీ..ఛీ..మారని పాక్..  న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి!

పాకిస్తాన్‌తో జరిగిన తొలి 20 మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది న్యూజిలాండ్. ముందుగా బ్యాంటింగ్ చేసిన పాక్ 18.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్ కాగా.. కివీస్ ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది.

New Update
pak vs nz match

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్థాన్ ఆటలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ20లో కూడా ఘోర ఓటమిని చవిచూసింది.  ఛాంపియన్స్ ట్రోఫీ ఘోర ఓటమిని దృష్టిని పెట్టుకుని పాక్ క్రికెట్ బోర్డు కివీస్ టూర్ కోసం జట్టులో మార్పులు చేసింది. కెప్టెన్ రిజ్వాన్,  బాబర్ ఆజమ్ లాంటి ఆటగాళ్లను పక్కన పెట్టింది.  అయినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు.

Also read :  Karnataka: రోజుకో రకంగా వాంగ్మూలం..తికమక పెడుతున్న రన్యారావు

Also read :  ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

91 పరుగులకే ఆలౌట్

క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాంటింగ్ చేసిన పాక్ 18.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్ అయింది.  న్యూజిలాండ్ గడ్డపై పాక్ కు ఇదే అత్యల్ప టీ20 స్కోర్.   ఖుష్దిల్ షా 32(30), అఘా సల్మాన్ 18(20) పరుగులు చేశారు.  న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 4, కైల్ జామిసన్ మూడు వికెట్లు తీశాడు.  ఆ తరువాత 92 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ జట్టు 10.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది. టిమ్ సీఫెర్ట్ 44(29),ఫిన్ అలెన్ 29(17) పరుగులు చేసి జట్టును గెలిపించారు. దీంతో 9 వికెట్లతో విజయం సాధించి సిరీస్ లో ముందంజలో ఉంది.  

Also Read :  Hydra: రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ‘స్పెషల్ పోలీస్‌స్టేషన్, పత్యేక కోర్టులు’

Also read :  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sunil Gavaskar : మీ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ గవాస్కర్ .. వినోద్ కాంబ్లీకి సాయం!

సునీల్ గవాస్కర్ గొప్ప మనసు చాటుకున్నాడు. గవాస్కర్ తన 'CHAMPS ఫౌండేషన్' ద్వారా వినోద్ కాంబ్లీకి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి నెలా రూ.30 వేల చొప్పున అందజేయనున్నట్లుగా తెలిపారు. ఈ ఫౌండేషన్ నిరుపేద మాజీ అంతర్జాతీయ క్రీడాకారులకు సహాయం చేస్తుంది.

New Update
Sunil Gavaskar fulfils his promise

Sunil Gavaskar fulfils his promise

భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గొప్ప మనసు చాటుకున్నాడు. సునీల్ గవాస్కర్ తన 'CHAMPS ఫౌండేషన్' ద్వారా వినోద్ కాంబ్లీకి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి నెలా రూ.30 వేల చొప్పున అందజేయనున్నట్లుగా తెలిపారు. CHAMPS ఫౌండేషన్ నిరుపేద మాజీ అంతర్జాతీయ క్రీడాకారులకు సహాయం చేస్తుంది. 1999లో ప్రారంభమైన ఈ ఫౌండేషన్, కష్ట సమయాల్లో కాంబ్లీకి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం శుభపరిణామం. 2025 ఏప్రిల్ 1 నుండి CHAMPS ఫౌండేషన్ ద్వారా వినోద్ కాంబ్లీ బతికి ఉన్నంత వరకు నెలకు రూ.30000 అందిస్తానని సునీల్ గవాస్కర్ హామీ ఇచ్చారు.

Also read :  ఎక్కువ చేయొద్దు.. ఎంపీ చామలకు సీఎం రేవంత్ క్లాస్.. ఆ ఎమ్మెల్యేలకు కూడా..!

 

బీసీసీఐ నుండి నెలకు రూ.30000 పెన్షన్

ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ  కార్యక్రమంలో వినోద్ కాంబ్లిని సునీల్ గవాస్కర్‌ కలిశారు. నడవడానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ కాంబ్లి గవాస్కర్ పాదాలను తాకారు.  ఆ సమయంలోనే ఆయన పరిస్థితి తెలుసుకున్న గవాస్కర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  కాగా భారత్  తరపున 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడిన వినోద్ కాంబ్లీకి బీసీసీఐ నుండి నెలకు రూ.30000 పెన్షన్ కూడా లభిస్తుంది. కాబట్టి అతని నెలవారీ ఆదాయం రెట్టింపు అవుతుంది, ఇది మాజీ క్రికెటర్ కుటుంబానికి గొప్ప సహాయంగా ఉంటుందని చెప్పాలి.  గవాస్కర్ గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  

Also read : TG crime : నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!

Advertisment
Advertisment
Advertisment