/rtv/media/media_files/2025/03/23/EcJ0zBha3dNHMkXyUaaY.jpg)
చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ తడబడింది. 20 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు. ఖలీల్ అహ్మద్ వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికి రోహిత్ శర్మ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. ఆ కాసేపటికే ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లోనే మరో ఓపెనర్ రికెల్టన్ (13), అశ్విన్ బౌలింగ్‌లో విల్ జాక్స్ (11) త్వరత్వరగానే ఔట్ అయ్యారు.
A late cameo from Deepak Chahar has taken Mumbai Indians to a total of 155 for the loss of 9 wickets in their 20 overs and their bowlers have something to defend. #CSKvsMI #IPL2025 #MSDhoni pic.twitter.com/rpnu3PvmUJ
— Kishore Mahi 💛💙 (@Kishore18568194) March 23, 2025
మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో
వెంటవెంటనే మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29), తిలక్ వర్మ (31) ఆచితూచి ఆడుతూ జట్టు స్కోర్ ను 7 ఓవర్లలో స్కోర్ 60 దాటించారు. అయితే నూర్‌అహ్మద్ బౌలింగ్‌లో ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేసిన సూర్యకుమార్ యాదవ్ .. ధోనీకి అడ్డంగా దొరికిపోయాడు. ఇక తరువాత రాబిన్ మింజ్ (3), తిలక్ వర్మ, నమన్ ధిర్ (17), మిచెల్ శాంట్నర్ (11) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. చివర్లో దీపక్ చాహర్ (28) మెరుపులు మెరిపించడంతో. ముంబై జట్టు155 పరుగులు అయిన చేయగలిగింది. చెన్నై బౌలర్లలో నూర్‌అహ్మద్ నాలుగు, ఖలీల్ అహ్మద్ మూడు, అశ్విన్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీశారు.
Also read : IPLలో ఆంధ్రా రోయ్యల వ్యాపారి కొడుకు.. ఎవరీ సత్యనారాయణరాజు?