/rtv/media/media_files/2025/04/06/QUtzoQU9gJlXDIX0TKoX.jpg)
siraj 100
ఉప్పల్ స్డేడియంవేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. -ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 12వ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 97 ఐపీఎల్ మ్యాచ్ లలో సిరాజ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 26 బౌలర్ గా నిలిచాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను ఔట్ చేయడం ద్వారా సిరాజ్ ఈ ఘనత అందుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ 6 ఓవర్లకు గానూ రెండు కీలక మైన 2 వికెట్ల కోల్పోయి 45 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ (2), ఇషాన్ కిషన్ (15) క్రీజులో ఉన్నారు.
Also Read : దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ
🚨 SIRAJ COMPLETED 100 WICKETS IN IPL HISTORY🚨#SRHvGT #SRHvsGT #GTvsSRH #ShubmanGill #PatCummins #MohammedSiraj pic.twitter.com/so98rp7ZkT
— Harsh (@Harshsuthar119) April 6, 2025
Also read : డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
జట్లు ఇవే
సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ
గుజరాత్ టైటాన్స్ : సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్ ), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ