నేను తాబేలు లాంటిదాన్ని.. ఆ బాధ ఎప్పటికీ మరిచిపోలేను: మను భాకర్

భారత షూటర్‌ మనుభాకర్‌ కెరీర్‌లో ఎదురైన అనుభవాలను బయటపెట్టింది. నిజానికి తాను షూటర్‌ అవుతానని ఎన్నడూ అనుకోలేదని చెప్పింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన బాధను ఎప్పటికీ మరిచిపోలేనంది. తాను తాబేలులా లక్ష్యాన్ని చేరాలనుకుంటానని తెలిపింది. 

New Update
fdtere

Manu Bhaker: పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత షూటర్‌ మను భాకర్‌ తన కెరీర్‌ లో ఎదురైన భిన్నమైన అనుభవాలను బయటపెట్టింది. నిజానికి తాను షూటర్‌ అవుతాననుకోలేదని, కెరీర్ పై ఎన్నడూ స్పష్టత ఉండేది కాదని చెప్పింది. రీసెంట్ గా సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన మను భాకర్.. రకరకాల ఆటలపై ఆసక్తి చూపించేదానినని తెలిపింది. 

'నా జీవితంలో నేను కోరుకునేది ఒక్కటే.. ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండాలనుకోవడం. మంచి పని చేయాలి. పోటీ పడటం చాలా ఇష్టం. అలాగే షూటింగ్ నేర్చుకున్నా. మిగతా వారి కంటే ఎప్పుడూ ఉత్తమంగా రాణించాలనుకుంటా. గెలుపు కోసం కాకుండా మెరుగైన ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టేదాన్ని.  2020 టోక్యో ఒలింపిక్స్‌ షూటింగ్‌లో తుపాకీ సమస్య కారణంగా పతకం కోల్పోయాను. ఆ బాధ నుంచి నా తల్లి, కోచ్‌ బయటపడేశారు. అప్పుడు ఆటను వదిలేద్దామనుకున్నా. అమ్మ, నా కోచ్‌ జస్పాల్‌ రాణా నాలో ధైర్యం నింపారు. కుందేలు తాబేలు కథలో మాదిరిగా నేను తాబేలులా నెమ్మదిగానైనా లక్ష్యాన్ని చేరాలనుకుంటా' అంటూ చెప్పుకొచ్చింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు