/rtv/media/media_files/2026/04/01/lsg-2026-04-01-20-35-00.jpg)
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయింది. మార్ష్ 35 పరుగులు చేసి కుల్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9.3 ఓవర్లకు జట్టు స్కోర్ 71/5. అబ్దుల్ సమద్ క్రీజులో ఉన్నాడు. ఇక అంతకుముందు క్రీజు బయట ఉన్న పంత్ (7) దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం అక్షర్ పటేల్ బౌలింగ్‌లో (5.5) ఐదెన్ మార్‌క్రమ్ (11) బౌల్డ్‌అయ్యాడు.
Lucknow Super Giants vs Delhi Capitals, LIVE Updates..
— MK Sharma ✍️ (@EmediaManoj) April 1, 2026
Kuldeep vs Mitch Marsh in T20s:
Innings: 6
Balls: 33
Runs: 49
Dismissals: 4
Avg: 12.25
SR: 148.5
Dot%: 39.3#LSGvsDC#DCvsLSG#MitchellMarsh#KuldeepYadavpic.twitter.com/YIVUhia6Gl
దీంతో రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న లక్నోకు మూడో వికెట్ రూపంలో మరో షాక్ తగిలింది. టి.నటరాజన్ బౌలింగ్‌లో (6.3) వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఆయుష్ బదోని డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం లుంగి ఎంగిడి బౌలింగ్‌లో (8.5) నికోలస్ పూరన్ (8) బౌల్డ్ అయ్యాడు. ముకుల్ చౌదరితో కలిసి ఇన్సింగ్స్ నడిపించిన మార్ష్ 35 పరుగులు చేసి కుల్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తక్కవ పరుగులకే లక్నో కీలక 5 వికెట్లు కోల్పోయి చాలా కష్టాల్లో పడింది.
Follow Us