KL Rahul: ఆర్సీబీలోకి కేఎల్ రాహుల్.. స్టార్ ప్లేయర్ గ్రీన్ సిగ్నల్!

స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరోసారి ఆర్సీబీ జట్టులో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఆడుతారా? అనే ఓ అభిమాని ప్రశ్నకు రాహుల్ పాజిటివ్‌గా స్పందించాడు. అదే జరగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు.

New Update
rcb

KL Rahul: భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మరోసారి బెంగళూర్ జట్టులో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ గా ఉన్న రాహుల్.. వచ్చే సీజన్ లోనే ఆర్సీబీకి ఆడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇటీవలో ఓ అభిమానితో సంభాషణలో రాహుల్ సైతం ఆర్సీబీకి ఆడటాన్ని ఆశ్వాదిస్తానని చెప్పడం దీనికి మరింత బలం చేకూరింది.

ఈ మేరకు ఇటీవల ఆర్సీబీతో చేరాలని ఓ అభిమాని రాహుల్ ను కోరుతూ.. 'బెంగళూర్ జట్టుకు నేను బిగ్ ఫ్యాన్. గతంలో మీరు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు. మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నిజంగా బెంగళూరు జట్టులోకి రావాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. అయితే అభిమాని రిక్వెస్ట్ పై పాజిటీవ్ గా స్పందించిన రాహుల్‌.. ‘అదే జరగాలని ఆశిద్దాం’ అన్నాడు. దీంతో మరోసారి రాహుల్ ఆర్సీబీలోకి రాబోతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతోపాటు గత సీజన్ లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో లఖ్‌నవూ చిత్తుగా ఓడటంతో మైదానంలోనే రాహుల్‌పై ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్‌ గోయెంకా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ ఆ జట్టును వదిలేస్తాడనే ఊహగానాలందుకున్నాయి. ఇక 2013లో ఆర్సీబీతోనే రాహుల్ ఐపీఎల్‌ కెరీర్‌ మొదలవగా.. 2014, 2015లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2016లో తిరిగి బెంగళూరు ఆడాడు. 2022 నుంచి లఖ్‌నవూ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

#kl-rahul #rcb
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Rohit Sharma Highlights: రోహిత్ శర్మ వీరబాదుడు.. 1...

Rohit Sharma Highlights: రోహిత్ శర్మ వీరబాదుడు.. 12 నిమిషాల హైలైట్స్ చూశారా?

సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టేశాడు. తాజాగా రోహిత్ బ్యాటింగ్ హైలైట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Highlights

Rohit Sharma Highlights

Rohit Sharma Highlights  

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మాన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టేశాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. SRH బౌలర్లకు చిక్కకుండా అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. నిన్న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 

లక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. చాలా జాగ్రత్తగా ఆడాడు. అప్పటి వరకు రోహిత్ ఫామ్‌లో లేడని మొరిగిన వారికి తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. అవతల ప్రత్యర్థి బౌలర్ ఎంతటి వాడైనా.. వెనక్కి తగ్గలేదు. వేసిన ప్రతి బాల్‌ను బౌండరీకి పంపాడు. ఎలా లేదన్నా ప్రతి ఓవర్‌లో ఒక సిక్స్ లేదా ఫోర్‌ను కొట్టాడు. వరుస మ్యాచ్‌లు తడబడుతూ వచ్చిన రోహిత్ SRH తో మంచి ఫామ్ కనబరిచాడు. 

Also Read : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

హైలైట్స్ వీడియో

మొత్తంగా ఈ మ్యాచ్‌లో 46 బంతుల్లో 70 పరుగులు చేసి.. జట్టు విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అతడి ఆట ప్రదర్శనకు క్రికెట్ ప్రియులు, రోహిత్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడిన హైలైట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 10.30 నిమిషాలు గల ఆ వీడియోలో రోహిత్ బ్యాటింగ్ చూడవచ్చు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

రోహిత్ రికార్డ్

SRHతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతుల్లో 70 పరుగులు చేసిన రోహిత్.. టీ20 క్రికెట్‌లో భారీ స్కోర్ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. టీ20ల్లో హిట్ మ్యాన్ దాదాపు 12,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన రెండవ భారత ప్లేయర్‌గా రోహిత్ తన పేరిట రికార్డు క్రియేట్ చేసుకున్నాడు. అలాగే ఓవరాల్‌గా టీ20ల్లో 12వేల పరుగుల క్లబ్‌లో చేరిన 8వ ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం అతడు 12,058 పరుగులను కలిగి ఉన్నాడు. 

rohith-sharma | latest-telugu-news | telugu-news | IPL 2025 | srh-vs-mi

Advertisment
Advertisment
Advertisment