‘నాకు క్రికెట్ కంటే చదువే ముఖ్యం.. ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నా’

క్రికెటర్లు క్రికెట్ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా చదువుపై కూడా దృష్టిపెట్టాలని కేకేఆర్ స్టార్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ తెలిపాడు. ఇప్పుడు తాను పీహెచ్‌డీ (ఫైనాన్స్) చేస్తున్నా అన్నాడు. తాను ఎప్పుడూ ఆట గురించి ఆలోచించడానికి ఇష్టపడనన్నాడు.

New Update
venkatesh iyer

ఐపీఎల్ మెగా వేలం ఇటీవల ఉత్కంఠగా జరిగింది. ఈ వేలంలో టీమిండియా ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్‌ భారీ ధరకు అమ్ముడుపోయాడు. కేకేఆర్ రూ.23.75 కోట్లకు వెంకటేశ్‌ను సొంతం చేసుకుంది. అయితే వెంకటేశ్‌ అయ్యార్‌కు క్రికెట్ అన్నా.. చదువు అన్నా చాలా ఇష్టం. ఈ రెండింటిలో వెంకటేశ్ చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. 

Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!

జాబ్ ఆఫర్ వద్దని క్రికెట్ వైపు

అతడు 2018లో ఫైనాన్స్‌లో ఎంబీఏ సైతం కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత బెంగళూరులోని డెలాయిట్ కంపెనీ నుంచి అదిరిపోయే శాలరీతో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. కానీ ఉద్యోగం చేస్తూ తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం కష్టమని భావించి ఆ జాబ్ ఆఫర్‌ను వద్దనేశాడు. ఇక ఇటీవల ఐపీఎల్ వేలంలో భారీ ధర పలకడంతో అతడి పేరు మారు మోగిపోయింది. 

Also Read: ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!

ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు

ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్రికెటర్లు కేవలం క్రికెట్‌ పరిజ్ఞానానికే పరిమితం అవ్వకూడదన్నాడు. దాంతో పాటు సాధారణ పరిజ్ఞానం సంపాదించడం కోసం చదువుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. గ్రాడ్యుయేషన్‌ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే మంచిదని పేర్కొన్నాడు. 

Also Read: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు!

ప్రస్తుతం తాను తన పీహెచ్‌డీ (ఫైనాన్స్) చేస్తున్నానని అన్నారు. దీంతో తరువాత నుంచి ఎవ్వరైనా డాక్టర్ వెంకటేశ్ అయ్యర్‌ని ఇంటర్వ్యూ చేస్తారు అని చెప్పుకొచ్చాడు. తాను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని.. అందువల్ల కేవలం క్రికెట్ పై మాత్రమే ఫోకస్ పెడతానంటే తల్లిదండ్రులు ఒప్పుకోరన్నాడు. కానీ తన పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నాడు. తాను బాగా చదవడంతో క్రికెట్‌లో రాణించాలని తన తల్లిదండ్రులు కోరుకున్నట్లు తెలిపాడు. 

Also Read: భారతీయులకు అలర్ట్‌...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!

ఏ క్రికెటర్ అయినా 60 ఏళ్ల వరకు ఆడలేడు.. కానీ విద్య చనిపోయే వరకు మనతోనే ఉంటుందన్నాడు. జీవితంలో రాణించాలనుకుంటే బాగా చదువుకోవాలని.. అలా చేస్తేనే ఆటలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం అని పేర్కొన్నాడు. అయితే తానెప్పుడూ ఆట గురించి ఆలోచించడానికి ఇష్టపడనని అన్నాడు. దాని వల్ల ఒత్తిడిపెరుగుతుందని తెలిపాడు. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి విద్య అనేది బాగా యూజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Khushdil Shah: చిర్రెత్తిపోయిన చిన్నోడు.. అభిమానులను కొట్టబోయిన పాక్ క్రికెటర్ - వీడియో చూశారా?

న్యూజిలాండ్‌తో 3వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్ 0-3 తేడాతో ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్ తర్వాత పాక్ క్రికెటర్ ఖుష్దిల్ షా ప్రేక్షకులను కొట్టడానికి దూసుకెళ్లాడు. ఆఫ్ఘన్ అభిమానులు పాక్ క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించడంతో అతడు అలా చేసినట్లు తెలుస్తోంది.

New Update
Pakistan Cricketer Khushdil Shah Attacks Fans During NZ ODI

Pakistan Cricketer Khushdil Shah Attacks Fans During NZ ODI

పాకిస్థాన్ క్రికెటర్ ఖుష్దిల్ షా వార్తల్లో నిలిచాడు. అతడు తన అనుచిత ప్రవర్తన ద్వారా విమర్శలకు గురయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ఖుష్దిల్ షా ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లడంతో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకీ ఏం జరిగింది?.. ఎందుకు ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లాడు? అనే విషయానికొస్తే.. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

న్యూజిలాండ్ vs పాకిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌‌లో భాగంగా న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ 0-3 తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. మొదటిగా రెండు వన్డేలు ఓడిపోయిన పాకిస్థాన్ శనివారం (ఏప్రిల్ 5) జరిగిన మూడో వన్డేలో సైతం కుప్పకూలిపోయింది. ఈ చివరి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌పై పాక్ 43 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. దీంతో పాక్ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

దానికి తోడు ఇటీవలే టీ20 సిరీస్‌ను సైతం పాకిస్థాన్ కోల్పోయింది. 1-4 తేడాతో ఓటమిపాలైంది. అప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న పాకిస్థాన్‌కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో పాక్ క్రికెటర్లు ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఇదే క్రమంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆల్‌రౌండర్ క్రికెటర్ ఖుష్దిల్ షా అనుచిత ప్రవర్తన వైరల్‌గా మారింది. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ప్రేక్షకులపై దాడికి యత్నం

ఈ మ్యాచ్ జరిగిన తర్వాత ఖుష్దిల్ షా క్రికెట్ అభిమానుల మీదకు దూసుకెళ్లాడు. అందుకు ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ తర్వాత కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్రియులు పాక్ క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దానిని ఆపమని ఖుష్దిల్ షా వారిని కోరినా.. వారు దుర్భాషలాడుతూనే ఉండటంతో అతడు ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లినట్లు సమాచారం. అప్పటికే సిరీస్ టీ20 సిరీస్‌ను కోల్పోయిన పాక్.. ఇప్పుడు వన్డే సిరీస్‌ క్లీన్ స్వీప్ కావడంతో విలవిల్లాడిపోయిందని అందుకే ఖుష్దిల్ క్రూరంగా ప్రవర్తించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

పీసీబీ స్పందన 

దీనిపై పీసీబీ స్పందించింది. ‘‘జాతీయ ఆటగాళ్లను ఉద్దేశించి విదేశీ ప్రేక్షకులు దుర్భాషలాడడాన్ని పాకిస్తాన్ క్రికెట్ జట్టు యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈరోజు మ్యాచ్ జరుగుతున్న సమయంలో, మైదానంలో ఉన్న క్రికెటర్లపై విదేశీ ప్రేక్షకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు" అని పిసిబి తెలిపింది. 

(latest-telugu-news | telugu-news | pcb | Khushdil Shah | NZ vs Pak)

Advertisment
Advertisment
Advertisment