/rtv/media/media_files/2026/02/16/ishan-kishan-networth-2026-02-16-17-38-52.jpg)
Ishan Kishan Networth
భారత్, పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15న జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కొలంబోలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత జట్టు.. పాకిస్థాన్‌కు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ పాకిస్తాన్ జట్టు కేవలం 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కేవలం 40 బంతుల్లో 77 పరుగులు చేసి పాకిస్తాన్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ ఆస్తుల విలువ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇషాన్ ఆస్తుల విలువ
పాట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ ఐపీఎల్, ఇతర ఫార్మాట్లలో క్రికెట్ ఆడటం ద్వారా కోట్ల విలువైన ఆస్తులను సంపాదించాడు. ఓ నివేదిక ప్రకారం.. ఇషాన్ కిషన్ నికర విలువ 7 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.63 కోట్లు. ఇందులో క్రికెట్ నుండి వచ్చే ఆదాయంతో పాటు వివిధ కంపెనీల బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా వచ్చే ఆదాయం కూడా ఉంది.
Also Read: మేడారం జాతరలో ‘కోవా బన్’ చిచ్చు.. అసలు వివాదం ఎలా, ఎందుకు మొదలైందంటే?
కాగా ఇషాన్ కిషన్ ఐపీఎల్ కెరీర్‌లో అద్భుతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 2016లో గుజరాత్ అతన్ని తొలిసారి రూ.3.5 మిలియన్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుండి అతని ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని రూ.11.25 కోట్లకు దక్కించుకుంది.
క్రికెట్ నుండి మాత్రమే కాకుండా
ఇదిలా ఉంటే క్రికెట్‌లోనే కాకుండా ఇషాన్ కిషన్ తనకున్న ప్రజాదరణతో అనేక పెద్ద బ్రాండ్‌లకు ప్రకటనలు చేసి కూడా బాగా సంపాదిస్తున్నాడు. నివేదికల ప్రకారం.. క్రికెట్ నుండి వచ్చే సంపాదనతో పాటు, ఇషాన్ నాయిస్, SG స్పోర్ట్స్, డ్రీమ్11, స్కెచర్స్, ఒప్పో, ఇతర బ్రాండ్‌ల ఎండార్స్‌మెంట్‌ల ద్వారా సంపాదిస్తున్నాడు.
Also Read: అమరావతికి బిల్‌గేట్స్.. సంజీవని, ఇతర సేవలపై ప్రశంసలు
లగ్జరీ లైఫ్ స్టైల్, కార్లు & వాచెస్
ఇషాన్ కిషన్ ఖరీదైన, విలాసవంతమైన కార్లను ఇష్టపడతాడు. అతని వద్ద మెర్సిడెస్ బెంజ్ GLS 450 AMG లైన్, మెర్సిడెస్ C-క్లాస్, ఫోర్డ్ ముస్తాంగ్, BMW X7తో సహా ఇతర కార్లు ఉన్నాయి. దీంతో పాటు ఇషాన్‌కు లగ్జరీ వాచ్‌లు అంటే కూడా చాలా ఇష్టం. అతని వద్ద రోలెక్స్, ఫ్రాంక్ ముల్లర్ బ్రాండ్ల ఖరీదైన వాచ్‌లు ఉన్నట్లు సమాచారం. అలాగే అతనికి పాట్నాలోని రాజేంద్ర నగర్‌లో ఒక విలాసవంతమైన ఇల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Follow Us