సిరాజ్‌ మాములోడు కాదు.. స్టార్ సింగర్ మనవరాలితో డేటింగ్ .. అమ్మాయి ఎవరంటే!

క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌తో సింగర్ జనాయ్ భోంస్లే కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జనాయ్ భోంస్లే తన 23వ పుట్టినరోజు వేడుకలో మహ్మద్ సిరాజ్‌తో ఆమె క్లోజ్ పిక్ వైరల్ గా మారడంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
siraj, Zanai Bhosle

siraj, Zanai Bhosle Photograph: (siraj, Zanai Bhosle)

టీమిండియా  క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌తో సింగర్ జనాయ్ భోంస్లే కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  జనాయ్ భోంస్లే తన 23వ పుట్టినరోజును ముంబైలో జరుపుకున్నారు. ఈ ఈవెంట్ కు మహ్మద్ సిరాజ్‌ హాజరయ్యాడు.

అతనితో దిగిన ఫోటోలను  జనాయ్ భోంస్లే ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ  హైదరాబాదీతో క్యాండిడ్ అని ఉంది.  చాలామందితో జనాయ్ భోంస్లే ఫోటోలు దిగినప్పటికీ సిరాజ్ తో ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. 

దీంతో సిరాజ్‌తో ఆశా భోంస్లే మనవరాలు డేటింగ్ లో ఉందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సిరాజ్‌, జనాయ్ భోంస్లే నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.  ఆమె పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న వారిలో నటుడు జాకీ ష్రాఫ్, ఆమె అమ్మమ్మ ఆశా భోంస్లే, క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, సిద్ధేష్ లాడ్, సుయాష్ ప్రభుదేసాయి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయేషా ఖాన్ , ముంజ్యా స్టార్ అభయ్ వర్మ ఉన్నారు.  

మరోవైపు జనాయి భోంస్లే విషయానికొస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్‌ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఆశా భోంస్లే కుమారుడైన ఆనంద్ భోంస్లే కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 

Also Read :  వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ అదుపు తప్పి రెండు ఆటోలపై

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS DC: ఈ సాలాకప్ నమ్దే..ఢిల్లీపై విజయం..అగ్రస్థానానికి ఆర్సీబీ

ఐపీఎల్ లో ఈరోజు ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఢిల్లీ ఇచ్చిన 162 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలో ఛేదించింది. 

New Update
ipl

RCB VS DC

విరాట్ కోహ్లీ మళ్ళీ గర్జించాడు. యంగ్ స్లేయర్ కృనాల్ విజృంభించాడు. దీంతో ఢిల్లీ చేతులెత్తేసింది. ఈరోజు ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ అద్బుత విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. దీంతో 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి కాస్త టెన్షన్ పెట్టింది. కానీ ఓపెనర్ గా వచ్చిన కింగ్ కోహ్లీ నిలకడగా ఆడుతూ జట్టును నిలబెట్టాడు. అలాగే నాలుగు స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కృనాల్ విజృంభించేశాడు. దీంతో మ్యాచ్ ఆర్సీబీ వశమైంది. కృనాల్‌ పాండ్య (73*), విరాట్‌ కోహ్లీ (51) అర్ధశతకాలతో చెలరేగారు. దీంతో వరుసగా మూడు మ్యాచ్ లను గెలిచిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్ళింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు తీశాడు. ఆర్సీబీకి ఇది ఏడో విజయం. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని..

ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు ఓపెనర్లు మంచి ఫామ్ అందించారు. అభిషేక్‌ పోరెల్‌, డుప్లెసిస్‌ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఓపెనర్ అభిషేక్‌ పోరెల్‌ క్రీజులో ఎక్కువ సమయం నిలబడలేకపోయాడు. జోష్‌ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో పోరెల్‌ (28) ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కరుణ్ నాయర్ మరుసటి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. నాయర్‌ (4) ఔట్‌ అయ్యాడు. దీంతో 5 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు సాధించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, డుప్లెసిస్ మెల్లి మెల్లిగా పరుగులు రాబట్టారు. ఆచితూచి ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. డుప్లెసిస్‌ (22) ఔట్‌ అయ్యాడు. కృనాల్‌ పాండ్య వేసిన 9.5 ఓవర్‌లో విరాట్‌ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ జట్టు 10 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 72 పరుగులు మాత్రమే చేసింది. గత మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ స్కోర్ అనే చెప్పాలి. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 162 పరుగులు సాధించింది.

today-latest-news-in-telugu | IPL 2025 | dc vs rcb | match 

Also Read: India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

Advertisment
Advertisment
Advertisment