/rtv/media/media_files/2026/03/28/jacob-duffy-2026-03-28-20-39-04.jpg)
IPL 2026 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సిబి మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే సన్‌రైజర్స్ కు ఊహించని షాక్ తగిలింది. పవర్‌ప్లేలో మూడు వికెట్లు పడగొట్టింది. ఆర్‌సిబి తరఫున ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ ఆ మూడు వికెట్లనూ పడగొట్టాడు. ఇది అతనికి ఐపీఎల్‌లో తొలి మ్యాచ్.
న్యూజిలాండ్ కు చెందిన డఫీ తన అరంగేట్రం మ్యాచ్‌లోని రెండవ ఓవర్‌లోనే సన్‌రైజర్స్ విధ్వంసకర ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరినీ అవుట్ చేశాడు. 8 బంతుల్లో 7 పరుగులు చేసిన శర్మ డఫీకి తొలి బాధితుడయ్యాడు. అదే ఓవర్‌లో ట్రావిస్ హెడ్ ఒక అద్భుతమైన ఫోర్ కొట్టాడు, కానీ ఆ తర్వాతి బంతికే బౌండరీ సమీపంలో ఫిల్ సాల్ట్ చేతికి చిక్కి అవుటయ్యాడు.
Abhishek Sharma ✅
— Kamlesh prajapati (@Kprajapati111) March 28, 2026
Travis Head ✅
Nitish Reddy ✅
Jacob Duffy is on fire on his #TATAIPL debut 🔥#jacobduffy | #RCBvSRHpic.twitter.com/IdkOMYhqHK
రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌కు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఇతనిని రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. ఇతను 2026 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలవడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. 2025 క్యాలెండర్ ఇయర్లో డఫీ మొత్తం 81 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. తద్వారా 40 ఏళ్ల క్రితం సర్ రిచర్డ్ హ్యాడ్లీ నెలకొల్పిన రికార్డును (79 వికెట్లు) అధిగమించాడు.
Follow Us