/rtv/media/media_files/2026/03/28/srh-vs-rcb-2026-03-28-21-42-33.jpg)
ఐపీఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 38 బంతుల్లోనే 80 పరుగులు చేసి ఆర్‌సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతనికి తోడుగా అనికేత్ వర్మ 43 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 31 పరుగులతో మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. చివర్లో డేవిడ్ పేన్, జయదేవ్ ఉనద్కత్ నాటౌట్‌గా నిలిచి జట్టు స్కోరును 200 దాటించారు.
చెరో మూడు వికెట్లు పడగొట్టి
మరోవైపు ఆర్‌సీబీ బౌలర్లు వికెట్లు తీస్తూ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా జాకబ్ డఫీ, రొమారియో షెఫర్డ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి హైదరాబాద్ వేగాన్ని తగ్గించారు. సుయాశ్ శర్మ, అభినందన్ సింగ్, ఆర్‌సీబీ తరపున ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 202 పరుగులు చేయాల్సి ఉంది. తమ సొంత మైదానంలో ఇంత భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి.
Follow Us