IPL 2025 : లక్నోకు బిగ్ షాక్.. ఫస్టాఫ్‌కు మయాంక్ దూరం!

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే LSGకు షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా ఈ సీజన్ ఫస్టాఫ్‌కు అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్‌లో అదరగొట్టడంతో మెగా వేలంలో రూ.11 కోట్లు చెల్లించి మయాంక్‌ను LSG రిటైన్ చేసుకుంది.

New Update
lgg mayank

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా ఈ సీజన్ ఫస్టాఫ్‌కు అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు వెల్లడించాయి.  గత సీజన్‌లో అదరగొట్టడంతో మెగా వేలంలో రూ.11 కోట్లు చెల్లించి మయాంక్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌ రిటైన్ చేసుకుంది. 150kmph వేగంతో బంతులు వేయడం మయాంక్ ప్రత్యేకత అని చెప్పుకోవాలి.  

Also read :  మిచెల్ సాంట్నర్కు బిగ్ షాక్ .. కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసిన బోర్డు!

Also read :  ఆరు నెలలుగా నీళ్లు మాత్రమే తాగిన యువతి మృతి.. ఎందుకంటే..?

నాలుగు మ్యాచ్‌లకే పరిమితం

గాయం కారణంగా 2023 సీజన్‌కు దూరమైన తర్వాత, మయాంక్ ఐపీఎల్ 2024లో అద్భుతమైన అరంగేట్రం చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తన మొదటి మ్యాచ్‌లో అతను 27 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. జట్టులో తీవ్రమైన నొప్పి కారణంగా IPL 2024లో మయాంక్ కేవలం నాలుగు మ్యాచ్‌లకే పరిమితం అయ్యాడు  22 ఏళ్ల  మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్‌పై భారత్ తరుపున వన్డేలో  అరంగేట్రం చేసి మూడు మ్యాచ్‌లు ఆడి, 4 వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ సీజన్‌లో  లక్నో సూపర్ జెయింట్స్‌ తన మొదటి మ్యాచ్ ను  మార్చి 24న వైజాగ్‌లో ఢిల్లీతో ఆడనుంది.  

Also read : అబ్బా భలే ఉంది..ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం AI-జనరేటెడ్ పాట

Also read :  సచిన్ కూతుర్ని వదిలేసినట్టేనా.. కొత్త అమ్మాయితో గిల్ డేటింగ్!

Advertisment
Advertisment
Advertisment