Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ...  70శాతం సక్సెస్ రేటు!

కెప్టెన్ రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్‌గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ సమం చేశారు. 30 ఏళ్లు దాటాక కెప్టెన్సీలో 100 విజయాలు సాధించింది రోహిత్ శర్మ మాత్రమే.

New Update
rohit sharma captain

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా 2025 ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో  కెప్టెన్ రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్‌గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ సమం చేశారు. అన్ని ఫార్మాట్లూ కలిపి 137మ్యాచులకు కెప్టె్న్ గా వ్యవహరించిన రోహిత్ శర్మ...  33మ్యాచుల్లో మాత్రమే ఓటమిని చూశాడు. 3 మ్యాచ్ లు డ్రా కాగా..  ఒకటి రద్దయింది. 

ఇక 30 ఏళ్లు దాటాక కెప్టెన్సీలో 100 విజయాలు సాధించిన ప్లేయర్ రోహిత్ శర్మ మాత్రమే కావడం విశేషం. 52 వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టె్న్సీలో టీమిండియా 38 విజయాలు, 12 ఓటములకు చవిచూసింది.  వన్డేల్లో కెప్టెన్‌గా రోహిత్ సక్సెస్ రేటు 72 శాతంగా ఉంది.  ఇక రోహిత్ శర్మ 62 టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించగా..  49 మ్యాచ్‌లలో గెలువగా..  12 మ్యాచ్‌లలో ఓడిపోయింది. సక్సెస్ రేటు 74శాతంగా ఉంది.  రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు. రోహిత్ కెప్టె్న్సీలో ఐదు టైటిళ్లు గెలిచింది. రోహిత్ కెప్టె్న్సీలో  87 విజయాలు, 67 ఓటములున్నాయి.  

కింగ్ కోహ్లీ తరువాత

ఇక వన్డేల్లో అత్యంత తొందరగా 11 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. కింగ్ కోహ్లీ తరువాత వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగుల మార్క్ చేరుకున్న ఆటగాడిగా కెప్టెన్ రికార్డులకెక్కాడు.   11 వేల పరుగులు చేసిన బ్యాటర్లలో రన్ మెషీన్ విరాట్ 222 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించగా రోహిత్ 261 మ్యాచ్ లలో ఈ మైలురాయిని అందుకున్నాడు.  వీరి తర్వాత సచిన్ 276 మ్యాచ్ లలో తరువాత రికీ పాంటింగ్ 286 ఇన్నింగ్స్ లలో, గంగూలీ 288 మ్యాచ్ లలో ఈ లిస్ట్ లో ఉన్నారు.  అంతేకాకుండా వన్డేల్లో అత్యధిక సిక్సులు బాదిన భారత ఆటగాళ్లలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 338 సిక్సులు ఉండగా.. అగ్రస్థానంలో షాహిద్ అఫ్రిది 351 సిక్సులతో కొనసాగుతున్నాడు. 

Also Read :  చరిత్ర సృష్టించిన శుభ్‌మాన్ గిల్.. కోహ్లీ రికార్డు బ్రేక్!

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment