జూనియర్ ఆసియా కప్ హాకీ పురుషుల టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కి చేరుకుంది. ఇవాళ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. నిన్న (మంగళ వారం) జరిగిన సెమీ ఫైనల్లో భారత్ మలేసియాపై భారీ విజయం సాధించింది. 3-1 తేడాతో మలేసియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? భారత్ Vs పాకిస్థాన్ మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరపున దిల్‌రాజ్ సింగ్ (10వ నిమిషంలో), రోహిత్ (45వ నిమిషంలో), శారద్ నంద్ తివారీ (52వ నిమిషంలో) భారత్‌కు గోల్ అందించారు. అలాగే ఆట ముగిసే సమయానికి మలేషియా తరఫున కమరుద్దీన్ అజీముద్దీన్ (57వ నిమిషంలో) ఏకైక గోల్‌ను సాధించాడు. దీంతో మలేషియాపై భారత్ 3-1 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ భారత్ జట్టు పాకిస్థాన్‌ను ఢీకొంట్టుంది. Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! మరోవైపు పాకిస్థాన్ సెమీఫైనల్లో 4-2 గోల్స్ తేడాతో జపాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఇవాళ భారత్ - పాకిస్థాన్ టైటిల్ పోరుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే మరి ఈ ఫైనల్ మ్యాచ్‌ను ఎక్కడ చూడాలి అని అనుకుంటున్నారా? అక్కడకే వస్తున్నా.. Also Read : కాకినాడ పోర్ట్ లో అసలు ఏం జరుగుతుంది? ఎందులో చూడొచ్చంటే..? భారత్ వర్సెస్ పాకిస్థాన్, జూనియర్ ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 4, బుధవారం రాత్రి 8:30 గంటలకు IST ప్రారంభం కానుంది. ఇది ఒమన్‌లోని మస్కట్‌లో జరుగుతుంది. దీనిని ఒమన్ హాకీ అసోసియేషన్‌కి చెందిన యూట్యూబ్ ఛానెల్‌లో చూడొచ్చు. Also Read: నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్! . . . . . .