ఇండియా VS ఆస్ట్రేలియా.. విజయానికి చేరువలో భారత్‌

ఆస్ట్రేలియా -భారత్‌ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ప్రారంభమైంది.టీమిండియా ఆసిస్‌కు మూడోరోజు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 227 పరుగుల వద్ద ఆసీస్‌ 9వ వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీమిండియా విజయానికి చేరువలో ఉంది.

New Update
cricket test

ఆస్ట్రేలియా -భారత్‌ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ప్రారంభమైంది. టీమిండియా ఆసిస్‌కు మూడోరోజు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 150 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆసీస్‌ 104 రన్స్‌కు కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 487/6 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొత్తంగా భారత్‌ 533 పరుగులు కాగా లక్ష్యం 534 పరుగులు. విరాట్ కోహ్లీ సెంచరీ సాధించిన వెంటనే ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేయాలని భారత డ్రెస్సింగ్‌ రూమ్ నిర్ణయించింది. ప్రస్తుతం భారత్‌ విజయానికి అతి దగ్గర్లో ఉంది. 227 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 9వ వికెట్‌ కోల్పోయింది. మరో వికెట్‌ తీస్తే భారత్‌కు విజయం ఖాయం కానుంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK Vs PBKS: చెన్నై ముందు భారీ లక్ష్యం.. దుమ్మురేపిన పంజాబ్!

చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 219/6 రన్స్ చేసింది. పంజాబ్ ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరల్లో శశాంక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

New Update
pbk s csko

IPL 2025 Punjab Kings huge score against Chennai

CSK Vs PBKS: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 219/6 రన్స్ చేసింది. పంజాబ్ ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరల్లో శశాంక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మాద్ 2, అశ్విన్ 2, ముఖేష్‌ 1, నూర్ 1 వికెట్ పడగొట్టారు. 

ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ..

ఈ మేరకు ముల్లనూర్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సార‌థి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 9 సిక్సులు, 7 ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరోవైపు చెన్నై బౌలర్లు సైతం వరుస వికెట్లు పడగొట్టారు. ప్రియాన్ష్ మినహా ఏ బ్యాటర్ ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయారు. చివరల్లో శశాంక్ 52 మెరుపులు మెరిపించాడు. 


తుది జ‌ట్లు..
పంజాబ్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీప‌ర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శ‌శాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, నేహ‌ల్ వ‌ధేరా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కో యాన్సెస్, అర్ష్‌దీప్ సింగ్, ల్యూకీ ఫెర్గూస‌న్, చాహ‌ల్.

Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

చెన్నై : ర‌చిన్ ర‌వీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజ‌య్ శంక‌ర్, ర‌వింద్ర జ‌డేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీప‌ర్), అశ్విన్, నూర్ అహ్మద్, ముకేశ్ చౌద‌రీ, ఖ‌లీల్ అహ్మద్, ప‌థిర‌న‌.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

 

IPL 2025 | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment