46 పరుగులకే భారత్ ఆలౌట్ గురువారం ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను న్యూజిలాండ్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేసింది. కోహ్లీ, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్, డకౌట్ కాగా.. రిషబ్ పంత్ 20, జైస్వాల్ 13, సిరాజ్ 4 పరుగులు మాత్రమే సాధించారు. By Seetha Ram 17 Oct 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి India vs New Zealand: ఇండియా - న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ నిర్ణయం విఫలం అయింది. ఈ మొదటి టెస్ట్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. స్వదేశంలో భారత్ ను ఎవరూ అడ్డుకోలేరు అనేవాళ్లకు ఇదొక గట్టి దెబ్బ అనే చెప్పాలి. బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో జరుగుతోన్న తొలి టెస్ట్ లో న్యూజిలాండ్ బౌలర్లు.. టీమిండియాను గట్టి దెబ్బ కొట్టారు. ఇది కూడా చదవండిః గ్రూప్-1 అభ్యర్థులకు సర్కార్ పిలుపు 46 పరుగులకే ఆలౌట్ టీమిండియా స్టార్ బ్యాటర్లను సైతం కట్టడి చేశారు. పరుగులు కాదు కదా.. కనీసం బంతిని కూడా టచ్ చేయనివ్వకుండా బంబేలెత్తించారు. దీంతో భారత్ స్టార్ బ్యాటర్లు సైతం తడబడ్డారు. ఏకంగా న్యూజిలాండ్ బౌలర్ల దాటికి ఐదుగురు డకౌట్ అయ్యారు. అందులో నలుగురు స్టార్ బ్యాటర్లు కావడం విశేషం. వీరితో పాటు మిగతా బ్యాటర్లు కూడా తొందరగా విఫలమవడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 31.2 ఓవర్లలో 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది కూడా చదవండిః మత్తు స్ప్రే చల్లి, న్యూడ్ వీడియోలు తీసి.. జాయ్ పై మరో కేసు నమోదు ఎవరెన్ని రన్స్ చేశారు న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో రోహిత్ శర్మ కేవలం 2 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తమ ఖాతా తెరవకుండానే డకౌట్ తో వెనుదిరిగారు. మిగిలిన వారిలో యశ్వస్వి జైశ్వాల్ -13, పంత్ -20, కుల్దీప్ యాదవ్ -2, బుమ్రా -1, సిరాజ్ -4 పరుగులు చేశారు. ఇది కూడా చదవండిః టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు మొత్తంగా టీమిండియా 46 పరుగులకే ఆల్ ఔట్ అయింది. అయితే న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ చెలరేగిపోయాడు. మ్యాట్ హెన్రీ- 5/15, విలియమ్ ఓరౌర్కీ - 4/22, టిమ్ సౌథీ -1/8లతో దుమ్ము దులిపేశారు. #cricket #india #india-vs-new-zealand #new-zealand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి