Ind Vs Nz: టెస్టుల్లో మరో చెత్త రికార్డ్ క్రియేట్ చేసి భారత్!

టెస్టుల్లో భారత్ మరో చెత్త రికార్డు క్రియేట్ చేసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుల్లో 46 పరుగులకే ఆలౌటైంది. ఓవరాల్‌గా ఇండియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. గతలో ఆస్ట్రేలియాపై 36, ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. 

New Update
dtetrerse

Ind Vs Nz: టెస్టుల్లో భారత్ మరో చెత్త రికార్డు క్రియేట్ చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుల్లో అత్యల్ప స్కోర్ కు ఆలౌటైంది. న్యూజీలాండ్ బౌలర్ల దెబ్బకు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే కుప్పకూలింది. దీంతో 92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అత్యల్ప స్కోరు చేసింది. అయితే గతంలో స్వదేశంలో విండీస్‌పై (1987) 75 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక వీదేశాల్లో ఇంతకంటే తక్కువ స్కోర్ అడిలైడ్‌లో ఆసీస్‌ చేతిలో 36 రన్స్‌, లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. ఓవరాల్‌గా ఇండియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. 

ఇది కూడా చదవండి: BREAKING: గ్రూప్-1 అభ్యర్థులకు సర్కార్ పిలుపు

ఇది కూడా చదవండి: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!

ఇక 1969లో హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో 27 పరుగులకే టీమ్ఇండియా 6 వికెట్లు నష్టపోయింది. ఓవరాల్‌గా భారత్‌ అత్యంత తక్కువ స్కోరుకే 6 వికెట్లను కోల్పోవడం ఇది 6వసారి. స్వదేశంలో 10 పరుగుల్లోపే భారత్ మూడు వికెట్లను నష్టపోవడం ఇది 3వసారి. న్యూజిలాండ్ పైనే ఈ చెత్త రికార్డును నమోదు చేసింది భారత్. భార‌త బ్యాట‌ర్లలో రిష‌బ్ పంత్‌(20) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అయిదుగురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు. కోహ్లీ, స‌ర్ఫరాజ్ ఖాన్‌, జ‌డేజా, కేఎల్ రాహుల్‌, అశ్విన్‌ ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌ చేరారు.  కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు వికెట్లు పడగొట్టగా టిమ్‌ సౌథీ ఓ వికెట్‌ తీశాడు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు!

ఇది కూడా చదవండి: Caste Census: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి

భారత్ అత్యల్ప స్కోర్లు:
36 vs ఆస్ట్రేలియా (అడిలైడ్‌) 2020
42 vs ఇంగ్లండ్‌ (లార్డ్స్‌) 1974
46 vs న్యూజిలాండ్ (బెంగళూరు) 2024
58 vs ఆస్ట్రేలియా (బ్రిస్బేన్‌) 1947
58 vs ఇంగ్లండ్ (మాంచెస్టర్‌) 1952

Advertisment
Advertisment
తాజా కథనాలు