/rtv/media/media_files/2026/02/09/icc-2026-02-09-20-04-20.jpg)
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన హై-వోల్టేజ్ భారత్-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పెట్టిన వింత డిమాండ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఏకపక్షంగా తోసిపుచ్చింది. పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తూనే, మరోవైపు బంగ్లాదేశ్‌కు మాత్రం ఐసీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
భారత్‌తో మ్యాచ్ ఆడాలంటే తాము చెప్పిన మూడు పనులను చేయాలంటూ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఐసీసీ ముందు షరతులు ఉంచారు. ఒకటి భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను వెంటనే పునరుద్ధరించాలి. రెండవది ఐసీసీ ఆదాయంలో పాకిస్థాన్ వాటాను భారీగా పెంచాలి.మూడోవది భారత్, పాక్, బంగ్లాదేశ్‌ల మధ్య ముక్కోణపు సిరీస్ నిర్వహించాలి.
పాక్ డిమాండ్లపై ఐసీసీ ఫైర్!
అయితే పాక్ డిమాండ్లపై ఐసీసీ తీవ్రంగా స్పందించింది. ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడించడం తమ పరిధిలో లేదని అది భారత్ ప్రభుత్వ నిర్ణయం అని తేల్చి చెప్పింది. మిగిలిన డిమాండ్లను కూడా అస్సలు పట్టించుకోబోమని స్పష్టం చేస్తూ, పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ తీసింది.
భారత్‌లో ఆడటానికి నిరాకరించి వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌ను ఐసీసీ మాత్రం వెనకేసుకొచ్చింది. బంగ్లాదేశ్ తన నిర్ణయం వల్ల ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ఐసీసీ రెవెన్యూలో ఆ దేశ వాటాను యథావిధిగా చెల్లించాలని నిర్ణయించింది. అంతేకాకుండా, గతంలో కోల్పోయిన మహిళల వరల్డ్ కప్ ఆతిథ్యానికి బదులుగా, 2028 అండర్-19 వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులను బంగ్లాదేశ్‌కు ఇచ్చేందుకు ఐసీసీ సిద్ధమైంది.
Follow Us