ఛాంపియన్స్ ట్రోఫీ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఈ ట్రోఫీలో ఇండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగుతాయి. ఎన్నో వివాదాలు, చర్చలు తర్వాత పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ తేదీ దగ్గర కావుస్తుండగా ఐసీసీ టోర్నమెంట్ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. పాకిస్తాన్‌కు చెందిన ప్రసిద్ధ గాయకుడు అతిఫ్ అస్లామ్ ఈ పాటను ఆలపించాడు.
ఇది కూడా చూడండి: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు
The wait is over! 🎉
— ICC (@ICC) February 7, 2025
Sing along to the official song of the #ChampionsTrophy, Jeeto Baazi Khel Ke, featuring the master of melody @itsaadee 🎶🏆 pic.twitter.com/KzwwylN8ki
ఇది కూడా చూడండి: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్ అదానీ చిన్న కుమారుడి వివాహం!
అద్భుతంగా పాడిన అతిఫ్ అస్లామ్..
జీతో బాజీ ఖేల్ కే అంటూ అతిఫ్ అస్లామ్ అద్భుతంగా పాడాడు. అబ్దుల్లా సిద్ధిఖీ ఈ పాటను రూపొందించగా అద్నాన్ ధూల్, అస్ఫాండ్యార్ అసద్ లిరిక్స్ రాశారు. అయితే ఈ పాటను పాకిస్తాన్ వీధుల్లో, స్టేడియం, మార్కెట్‌లో తీశారు. ఎంతో అద్భుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరించడంతో పాటు పాటను అద్భుతంగా పాడారు. పాట మ్యూజిక్ అన్ని కూడా సూపర్‌గా ఉన్నాయి. ఇది ఆట మీద ఉన్న ప్రేమ, ఉల్లాసాన్ని తెలియజేస్తుంది.
ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!
ఈ ఛాంపియన్స్ ట్రోఫీ థీమ్ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని స్ట్రీమింగ్ ఆడియో ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రేమికులకు ఈ పాట మంచి ఊపునిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ కోసం టీమిండియా ఫ్యాన్స్‌తో పాటు పాకిస్థాన్ జట్టు ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.