భారత్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీలో చక్రం తిప్పుతున్న జైషా! ఛాంపియన్స్ ట్రోఫీ వేదికపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ మరో బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మెగా టోర్నీ భారత్ లోనే జరగబోతుందంటూ టాక్ వినిపిస్తోంది. ఐసీసీలో జైషా ప్రతిపాదన పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకనటన వెలువడనుంది. By srinivas 15 Nov 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఛాంపియన్స్ ట్రోఫీ వేదికకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 2025 టోర్నీకి పాకిస్థాన్ అతిథ్యం ఇవ్వనుండగా.. భారత్ నిరాకరణతో పరిస్థితి తలకిందులైంది. దీంతో టోర్నీ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. హైబ్రిడ్ మోడల్‌గా నిర్వహించాలని ఐసీసీ ఆలోచిస్తుండగా.. దానికి పాక్ బోర్డ్ అంగీకరింలేదు. ఈ క్రమంలోనే టోర్నీని దక్షిణాఫ్రికా తరలిస్తారనే వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా మరో ఆసక్తికర అంశం తెరపైకొచ్చింది. Get ready, Pakistan!The ICC Champions Trophy 2025 trophy tour kicks off in Islamabad on 16 November, also visiting scenic travel destinations like Skardu, Murree, Hunza and Muzaffarabad. Catch a glimpse of the trophy which Sarfaraz Ahmed lifted in 2017 at The Oval, from 16-24… pic.twitter.com/SmsV5uyzlL — Pakistan Cricket (@TheRealPCB) November 14, 2024 రంగం సిద్ధం చేసుకున్న ఐసీసీ.. ఈ మేరకు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆథిత్యం ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ఐసీసీ మొగ్గు చూపకపోగా.. ఇండియాలోనే టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్న జైషా భారత్ లోనే నిర్వహిస్తే బాగుటుందని ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత క్రికెట్ లవర్స్ నుంచి కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ICC reveals Logo and Brand Identity for Champions Trophy. pic.twitter.com/ckJN5vZZT6 — Ragav 𝕏 (@ragav_x) November 13, 2024 ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ పార్లమెంట్‌లో హాకా డాన్స్ చేసిన యంగ్ ఎంపీ..కొత్తగా అపోజ్ ఇదిలా ఉంటే.. వేదిక మారబోతున్నట్లు చర్చ జరుగుతున్న వేళ ఛాంపియన్స్ ట్రోపీకి సంబంధించిన ప్రోమో ఒకటి వైరల్ అవుతోంది. దీని ఆధారంగా పాక్ లోనే టోర్నీ జరుగుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక 2017లో ఇంగ్లండ్‌లో ఈ ట్రోఫీ జరగగా భారత్-పాకిస్థాన్ ఫైనల్లో తలపడ్డాయి. చివరికి పాక్ నే విజయం వరించింది. ఇది కూడా చదవండి: Tattoo: టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్! #india #icc #champions-trophy-2025 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి