/rtv/media/media_files/2025/04/01/Q1WqWptgwFZIPB3krjmw.jpg)
MI Ashwani Kumar
వాంఖడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ జట్టు బోణీ కొట్టింది. కోల్కతాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని కేవలం12.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ రోహిత్(13) మరోసారి నిరాశపరచగా.. మరో ఓపెనర్ రికెల్టన్ (62*) పరుగులతో రాణించాడు, జాక్స్ (16), సూర్య (27*) పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లలో రస్సెల్ 2 వికెట్లు తీశారు.
Debut straight out of a storybook 📖
— IndianPremierLeague (@IPL) March 31, 2025
The perfect first chapter for Ashwani Kumar 👌👌
Updates ▶ https://t.co/iEwchzDRNM#TATAIPL | #MIvKKR | @mipaltan pic.twitter.com/npaynbIViX
ఇక అంతకుముందు బ్యాటర్లంతా విఫలమవడంతో కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 16.2 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యల్ప స్కోరు ఇది. ముంబై కొత్త బౌలర్ అశ్వనీ కుమార్ కేకేఆర్ పతనాన్ని శాసించాడు. 23 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో స్పెషలిస్ట్. ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలింగ్‌తో 3 ఓవర్లలో 24 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Ashwani Kumar said, "I just had a banana for lunch because I was very nervous about how my debut will go, but I'm happy that it went well". #MIvsKKR pic.twitter.com/51tHuuKiLA
— Shalini (@Sudha1987148721) March 31, 2025
నిజంగా భయపడ్డా
అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన అశ్వనీ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తొలి మ్యాచ్ కు ముందు తాను నిజంగా భయపడ్డానన్నాడు. తొలి మ్యాచ్ కావడం వల్ల ఒత్తిడితో లంచ్ చేయలేదని, కేవలం అరటి పండు తిన్నట్లుగా వెల్లడించాడు. మంచి ప్రదర్శన ఇవ్వడానికి తాను కొంత ప్లాన్ చేసుకోగా, జట్టు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందన్నారు. షార్ట్ లెంగ్త్‌తో పాటు బ్యాటర్ల బాడీని టార్గెట్ చేస్తూ బంతులు వేయాలని కెప్టెన్ హార్దిక్ తనకు సూచించినట్లుగా అశ్వనీ తెలిపాడు.