అది చిన్న సరదా.. స్టార్క్ కవ్వింపుపై స్పందించిన హర్షిత్ రాణా!

ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ కవ్వింపు చర్యపై భారత బౌలర్ హర్షిత్ రానా క్లారిటీ ఇచ్చాడు. 'స్టార్క్‌ నాకు మంచి స్నేహితుడు. ఐపీఎల్‌లో మేమిద్దరం కలిసి ఆడాం. గ్రౌండ్ లో ఇలాంటివి కామన్. ఇదేం పెద్ద విషయం కాదు. చిన్న సరదా' అని చెప్పాడు. 

New Update
rerrr

Ind vs Aus: ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ కవ్వింపు చర్యపై భారత బౌలర్ హర్షిత్ రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో వీరిద్దరి మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే ఔట్ కాగా.. మిచెల్ స్టార్క్ ఒక్కడే 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

నీ కంటే వేగంగా బౌలింగ్‌ చేయగలను.

అయితే హర్షిత్ రాణా.. స్టార్క్‌కు బౌలింగ్‌ చేసినపుడు బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలోనే ‘హర్షిత్‌.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్‌ చేయగలను. పాత జ్ఞాపకాలు గుర్తున్నాయి’ అంటూ స్టార్క్ కామెంట్ చేశాడు. దీంతో వెంటనే హర్షిత్‌ నవ్వుతూ అలాగే అన్నట్లు తల ఊపాడు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ కాగా క్రికెట్ లవర్స్ కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో మరోసారి రియాక్ట్ అయిన హర్షిత్ క్లారిటీ ఇచ్చాడు. 

ఇది కూడా చదవండి: BREAKING: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

‘స్టార్క్‌ నాకు మంచి స్నేహితుడు. ఐపీఎల్‌లో మేమిద్దరం కలిసి ఆడాం. గ్రౌండ్ లో ఇలాంటివి కామన్. ఇదేం పెద్ద విషయం కాదు. చిన్న సరదా సంభాషణ' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో హర్షిత్ మొత్తం మూడు వికెట్లు పడగొట్టగా.. అందులో కీలకమైన ట్రావిస్ హెడ్ (11) వికెట్ కూడా ఉంది. స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్‌ చేయాలనే ఆలోచనతోనే హెడ్ వికెట్ తీసినట్లు చెప్పాడు. 

ఇది కూడా చదవండి: Balayya : రామ్ చరణ్ ను ఫాలో అవుతున్న బాలయ్య.. వర్కౌట్ అవుతుందా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH Highlights: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎన్నో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. హీరో వెంకీమామ, ప్రీతి జింటా కలిసి నటించిన సినిమా నుంచి సాంగ్ వేస్తూ అలరించారు. ఇద్దరూ వేరే వేరు జట్లు కావడంతో సాంగ్ బాగా సింక్ అయింది. ఆ సాంగ్‌తో ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.

New Update
srh vs pbks match

srh vs pbks

ఇప్పుడంతా అభిషేక్ శర్మ పేరే వినిపిస్తోంది. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు పవర్ ఫుల్ మ్యూజిక్‌లతో ఉప్పల్‌ స్టేడియంలో షేక్ చేసిన అభిషేక్ శర్మ వీడియోలే కనిపిస్తున్నాయి. బాదుడు చూశాం.. కానీ వీరబాదుడు చూడటం నిన్ననే చూశామని క్రికెట్ ప్రియులు అంటున్నారు. అది విధ్వంశమా.. విస్పోటనమా?.. దానికి ఏ పేరు పెట్టాలో తెలియడం లేదని చెబుతున్నారు. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

ఆరెంజ్ ఆర్మీ అంటే ఎంటో అందరికీ మరోసారి తెలిసేలా చేశారు. బౌలర్ ఎవరైనా.. బాల్‌ని గ్రౌండ్ బయటకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అభిషేక్. కొడితే ఇలా కొట్టాలి.. ఆడితే ఇలా ఆడాలి అని అభిమానులు, ఆరెంజ్ ఆర్మీ ప్రియులు మాట్లాడుకునేలా చేశాడు. మొదటి మ్యాచ్ తప్పించి మిగతా మూడు మ్యాచ్‌లు పేవలమైన బ్యాటింగ్ చేసిన అభిషేక్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 

Also Read: మరోసారి ఆగిపోయిన యూపీఐ సేవలు.. గందరగోళానికి గురవుతున్న వినియోగదారులు

ఎన్నో విచిత్రాలు

అయితే ఈ మ్యాచ్‌లో ఎన్నో విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా హీరో విక్టరీ వెంకటేష్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఫ్యాన్.. అలాగే పంజాబ్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ హీరోయిన్ ప్రీతీ జింటా. వీరిద్దరూ కలిసి గతంలో ప్రేమంటే ఇదేరా అనే సినిమా చేశారు. 

Also Read: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఇప్పుడు ఆ హీరో హీరోయిన్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. అదే సమయంలో వీరి సినిమా నుంచి ఓసాంగ్‌ను వేయగా.. స్టేడియం దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పాటు మరెన్నో జరిగాయి. అవి ఇప్పుడు చూసేయండి. 

SRH బౌలింగ్‌లో షమ్మీ వేసిన ఓవర్‌లో ఇషాన్ కిషన్ బాల్ పట్టి.. ఎలా తడబడ్డాడో చూడండి. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

అలాగే హైదరాబాద్ జట్టులో హెడ్ అండ్ అభిషేక్ వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతుండగా.. మాక్స్‌వెల్, ట్రివిస్ హెడ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ ఒకే దేశస్తులైన ఇలా గొడవ పడటంతో అంతా ఆశ్చర్యపోయారు.

IPL 2025 | srh-vs-pbks | abhishek-sharma | srh | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment