/rtv/media/media_files/2025/02/16/GGbW72MtITqw9msfXk2g.jpg)
భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్ సాధించారు. ప్రస్తుతం మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న 35 ఏళ్ల హర్మన్‌ప్రీత్ .. టీ20ల్లో 8వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచారు. హర్మన్ కన్నా ముందు స్మృతి మంధాన ఈ మైలురాయి అందుకున్నారు. ఆమె ప్రస్తుతం 8 వేల349 పరుగులు చేసింది.
ఈ మైలురాయిని చేరుకోవడానికి హర్మన్‌ప్రీత్‌కు 37 పరుగులు అవసరం కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఆ మైలురాయిని చేరుకుంది. కాగా తన మహిళల ప్రీమియర్ లీగ్ కెరీర్‌లో హర్మన్‌ప్రీత్ ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడి 591 పరుగులు పరుగులు చేసింది. మొత్తంమీద, హర్మన్‌ప్రీత్ ఈ రికార్డును నమోదు చేసిన 6వ భారతీయ బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరియు సురేష్ రైనా వంటి వారు ఇప్పటికే ఈ మైలురాయిని సాధించిన వారిలో ఉన్నారు.
𝗜.𝗖.𝗬.𝗠.𝗜
— Women's Premier League (WPL) (@wplt20) February 15, 2025
🚨 Milestone Moment 🚨
Earlier today, @mipaltan skipper Harmanpreet Kaur completed her 8⃣0⃣0⃣0⃣ T20 runs 👏👏
She becomes the 2⃣nd Indian after Smriti Mandhana to achieve this feat 👌👌#TATAWPL | #MIvDC | @ImHarmanpreet pic.twitter.com/u1zC9y5Hoc
అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్లు
8349 - స్మృతి మంధాన
8005 - హర్మన్‌ప్రీత్ కౌర్
5826 - జెమిమా రోడ్రిగ్స్
4542 - షఫాలీ వర్మ
4329 - మిథాలీ రాజ్
3889 - దీప్తి శర్మ
ఇక ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 19.1 ఓవర్లలోనే 164 పరుగులు చేయగలిగింది. నాట్ స్కైవర్-బ్రంట్ (80), హర్మన్‌ప్రీత్ కౌర్ (42) పరుగులు చేశారు. క్యాపిటల్స్ తరఫున అన్నాబెల్ సదర్లాండ్ 34 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి బౌలింగ్ లో రాణించింది.
165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఆఖరి బంతికి అందుకుంది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికి నిక్కీ ప్రసాద్ ఫోర్ బాదారు. ఆ తర్వాతి 3 బంతులకు నాలుగు పరుగులు రాగా ఐదో బంతికి నిక్కీ ఔటయ్యారు. చివరి బంతికి అరుంధతి రెండు పరుగులు తీసి ఢిల్లీకి విజయాన్ని అందించారు.
Also Read : దారుణం.. అదనపు కట్నం తేవడం లేదని కోడలికి హెచ్‌ఐవి ఇంజెక్షన్ ఇచ్చి ..