పార్టీలో చేరగానే X కేటగిరీ భద్రత.. BJP రాజకీయాల్లో టెన్నిస్ స్టార్ కొత్త ఇన్నింగ్స్!

గ్రాండ్ స్లామ్ విజేత లియాండర్ పేస్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. లియాండర్ పేస్ బీజేపీలో చేరిన వెంటనే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయన భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది.

New Update
_Leander Paes

భారత టెన్నిస్ దిగ్గజం, గ్రాండ్ స్లామ్ విజేత లియాండర్ పేస్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను రాజకీయాల వైపు మళ్లించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన బీజేపీలో చేరడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. లియాండర్ పేస్ బీజేపీలో చేరిన వెంటనే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయన భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు 'X' కేటగిరీ భద్రతను కేటాయించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పేస్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈక్రమంలో భద్రతాపరమైన ముప్పు అంచనా వేసిన హోం శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఇకపై CISF సిబ్బంది నిరంతరం ఆయనకు రక్షణగా ఉండనున్నారు. ఇటీవలే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన పేస్, ప్రధాని తనపై చూపిన గౌరవం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

2036 ఒలింపిక్స్

కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, క్రీడా రంగంలో భారత్ ప్రపంచ దేశాల సరసన నిలబడేలా ప్రధాని మోదీ కీలక బాధ్యతలను పేస్‌కు అప్పగించారు. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ చేస్తోన్న ప్రయత్నాల్లో పేస్ ఒక ముఖ్యమైన సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. దేశానికి సేవ చేయడం తనకెప్పుడూ గర్వకారణమని, ప్రధాని తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ క్రీడా భారతావని కోసం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌గా పేస్ పాల్గొననుండటంతో, అక్కడ పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. 

Advertisment
తాజా కథనాలు