/rtv/media/media_files/2025/10/30/dk-shivakumar-2025-10-30-07-17-19.jpg)
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు తమకు గౌరవప్రదమైన సీట్లు, టిక్కెట్లు కావాలని కర్ణాటక ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్‌పై ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలందరూ తమకు టిక్కెట్లు రావడం లేదని, క్రికెట్ అసోసియేషన్ తమను అవమానిస్తోందని ఫిర్యాదు చేయడంతో ఈ అంశం చర్చకు వచ్చింది.
ప్రతి ఎమ్మెల్యేకు 4 వీఐపీ టిక్కెట్లు ఇవ్వాలని స్పీకర్ యూటీ ఖాదర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే, డి.కె. శివకుమార్ మాత్రం అందరికీ 4 టిక్కెట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని స్పష్టం చేశారు. గతంలో ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రికి కేవలం ఒక సీటు మాత్రమే ఇచ్చేవాళ్లు. ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేందుకు వీలుగా కనీసం రెండు టిక్కెట్లు ఇవ్వాలని ప్రభుత్వం క్రికెట్ అసోసియేషన్‌ను కోరింది.శనివారం జరిగే మొదటి మ్యాచ్‌కు ప్రతి ఎమ్మెల్యేకు రెండు టిక్కెట్లు ఇస్తామని, తదుపరి మ్యాచ్‌ల గురించి తర్వాత చర్చిస్తామని ఆయన తెలిపారు.
'P3' స్టాండ్‌లో సీట్లు
ఎమ్మెల్యేలందరికీ స్టేడియంలోని 'P3' స్టాండ్‌లో సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. దీనివల్ల అందరూ ఒకే చోట కూర్చునే అవకాశం ఉంటుంది. గతంలో ఆర్‌సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన ఘటనను గుర్తు చేస్తూ, ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఇక్కడ మ్యాచ్‌లు జరుగుతున్నాయని డీకే గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు కూడా వ్యవస్థలో భాగమే కాబట్టి, వారికి తగిన ఏర్పాట్లు చేయడం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కూడా ఈ విషయంపై చర్చలు జరిపారు.
Follow Us