/rtv/media/media_files/2025/04/05/5nrqYsn56OhUa6u7Y0Jp.jpg)
Delhi Capitals
చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 77, అభిషేక్ పోరెల్ 33, అక్షర్ పటేల్ 21, సమీర్ రిజ్వీ 20, స్టబ్స్ 23 పరుగులు చేశారు. మెక్‌గుర్క్ డకౌట్ అయ్యి నిరాశపర్చాడు. ఇక ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరణ తలో వికెట్ తీశారు. గెలుపు కోసం చెన్నై జట్టు 184 పరుగులు చేయాలి.
Also read: గెలిచిన సంతోషమే లేదు కదరా.. రిషబ్ పంత్కు బిగ్ షాక్!
తొలుత టాస్ బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ డకౌట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అభిషేక్ పొరెల్ వరుసగా 4,6,4,4 బాదాడు. ఆ తర్వాత అభిషేక్‌ని జడేజా తన తొలి ఓవర్లోనే ఔట్ చేశాడు. అక్షర్ పటేల్ 21 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిపోయాడు.
Also Read: తిలక్ వర్మకు ఘోర అవమానం.. హార్దిక్ ఇది నీకు న్యాయమేనా?
12 ఓవర్లకు స్కోరు 100 దాటింది. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్.. ఫామ్‌లో ఉండి బాల్‌ను బౌండరీలకు పంపించారు. రిజ్వీని 17వ ఓవర్‌లో ఖలీల్ ఔట్ చేశారు. పతిరన వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో రాహుల్ ధోనికి క్యాచ్ ఇచ్చాడు. ఇక అశుతోష్ శర్మ ఒక్క పరుగుతో రనౌట్ అయ్యాడు.