Breaking News : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ పేరును ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. పటేల్ 2019 నుంచి ఢిల్లీ తరఫున ఆడుతున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ లో 150 మ్యాచులు ఆడిన ఈ ఆల్ రౌండర్ .. 3758 రన్స్, 123 వికెట్లు తీశారు.

New Update
Axar Patel

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ పేరును ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. కేఎల్ రాహుల్ ఉన్నా అక్షర్ పేరును అనౌన్స్ చేసింది. పటేల్ 2019 నుంచి ఢిల్లీ తరఫున ఆడుతున్నారు. అక్షర్ పటేల్ ఇప్పటివరకు150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 131 స్ట్రైక్ రేట్‌తో 1653 పరుగులు చేశాడు.  7.28 ఎకానమీ రేట్‌తో 123 వికెట్లు పడగొట్టాడు. 

"ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు చాలా గౌరవం, నాపై నమ్మకం ఉంచినందుకు మా యజమానం, సహాయక సిబ్బందికి నేను చాలా కృతజ్ఞుడిని" అని అక్షర్ పటేల్ అన్నారు.  2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్ ఇప్పుడు 2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ను ఎలా ముందుకు తీసుకు వెళ్తాడన్నది చూడాలి.  

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్న కేఎల్ రాహుల్ ఈ సీజన్  రెండు ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.  తన భార్య అతియా శెట్టి గర్భం దాల్చడం వల్ల రాహుల్ వైజాగ్ లో జరిగే మ్యాచ్ లకు దూరం కానున్నాడు.   రాహుల్ తొలిసారి ఢిల్లీ జట్టు తరుపున అడుతున్నాడు. అంతకుముందు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ జట్లకు నాయకత్వం వహించిన అనుభవం రాహుల్‌కు ఉంది.

ఏ జట్టు కెప్టెన్ ఎవరు? 

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్
 సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ పాట్ కమ్మిన్స్
 రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ సంజు శాంసన్ 
 చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్
ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషబ్ పంత్
గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 
పంజాబ్ కింగ్స్ (PBKS) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.

Also read :  ఎంత బలుపురా.. మద్యం మత్తులో100 స్పీడ్తో కారు నడిపి.. మహిళ స్పాట్ డెడ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే

ఆర్ఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. కోహ్లీ 70 పరుగులు, పడిక్కల్ 50 పరుగులతో చెలరేగిపోయారు.

New Update
RCB Vs RR

RCB Vs RR

టార్గెట్ ఎంతంటే?

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

రికార్డు మిస్

కోహ్లీ మొత్తంగా మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేవాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా కొత్త రికార్డును క్రియేట్ చేసేవాడు. కానీ మూడు సిక్సుల్లో రెండు మాత్రమే కొట్టడంతో ఆ రికార్డు మరో మ్యాచ్‌ కోసం షిఫ్ట్ అయింది. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరిట 299 సిక్సులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మరొక ప్లేయర్ హాఫ్ సెంచరీ చేశారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (50) చేసి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

telugu-news | virat-kohli | IPL 2025 | rcb-vs-rr | latest-telugu-news 

Advertisment
Advertisment
Advertisment