నిన్న ముల్లాపూర్ లో సొంత మైదానంలో చెన్నైతో తలపడింది పంజాబ్ కింగ్స్. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఎనిమిది ఒవర్లలోనే ఐదు వికెట్లు పడిపోయాయి. కానీ ఒక కుర్రాడు మాత్రం ఫీల్డ్ ను అతుక్కుని ఉండిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు చెక్కుచెదరకుండా ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. సీఎస్కే బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. ఆ కుర్రాడే ప్రియాంశ్ ఆర్య. 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్ లతో 103 పరుగులు చేసి పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అత్యంత ప్రమాదకరమైన పతిరన బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టి వారెవ్వా అనిపించాడు.
ఢిల్లీ కుర్రాడు..
24 ఏళ్ళ ప్రియాంశ్ ఆర్య ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. దేశావాళీల్లో కూడా పాతిక మించి ఆడి ఉండడు. కానీ ఐపీఎల్ లో సెలెక్ట్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ప్రియాంశ్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు. దేశవాళీలో కూడా ఢిల్లీ తరుఫునే ఆడాడు. 2021/22 సీజన్‌లో అరంగేట్రం చేసిన ప్రియాంశ్ కేవలం 7 లిస్ట్ - A మ్యాచులు ఆడాడు. అతడు చేసిన పరుగులు 77 మాత్రమే. దేశవాళీల్లో టీ 20ల్లో 22 మ్యాచుల్లో 731 పరుగులు చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో నార్త్ దిల్లీ స్ట్రైకర్‌పై 50 బంతుల్లోనే 120 పరుగులు చేసిన ఆర్య ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ పై 102 పరుగులతో చితక్కొట్టాడు. వీటితో వెలుగులోకి వచ్చిన ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో పంజాబ్ కింగ్స్ ఇతనిని రూ.3.80 కోట్లు ఇచ్చి దక్కించుకుంది.
ఐపీఎల్ లో ..
ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ నాలుగు మ్యాచ్ లు ఆడింది. మొదటి మ్యాచ్ లో గుజరాత్ పై 22 బంతుల్లో 47 పరుగులు చేసి తానమేంటో మరోసారి నిరూపించుకున్నాడు. భారీ మొత్తాన్ని వెచ్చించి ఎందుకు కొనక్కున్నారో చేసి చూపించాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో 8, 0 పరుగులతో తేలిపోయాడు. కానీ నిన్న ముల్లాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో మాత్రం విజృంభించేశాడు. ఐపీఎల్‌లో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
today-latest-news-in-telugu | IPL 2025 | punjab-kings
Also Read: Tahawwur Rana: భారత్ కు తహవూర్ రాణా అప్పగింత..స్పెషల్ ఫ్లైట్ లో..