/rtv/media/media_files/2025/03/10/A2DRqEnKKZgjjkhH7e3C.jpg)
టీమిండియాలోని కొంతమంది ఆటగాళ్లు క్రికెట్లో సక్సెస్ అవుతున్న వైవాహిక జీవితంలో మాత్రం రాణించలేకపోతున్నారు. గతేడాది నటాషా, స్టాంకోవిచ్ దంపతులు విడాకులు తీసుకోగా.. ఇటీవల యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడిచింది. ఇంతలోనే మరో క్రికెటర్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతను ఎవరో కాదు క్రికెటర్ మనీష్ పాండే, అతని భార్య ఆశ్రిత శెట్టి. అవును త్వరలో వీరిద్దరూ విడిపోతున్నట్లుగా వార్తలు కోడై కూస్తున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో
భారత్ తరపున 68 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మనీష్ పాండే, 2019 డిసెంబర్లో నటి అశ్రిత శెట్టిని వివాహం చేసుకున్నాడు. తరచుగా కలిసి కనిపించే ఈ జంట గత కొన్ని నెలలుగా ఎక్కడా కూడా కనిపించడం లేదు. మనీష్ పాండే, అశ్రిత ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా వారి పెళ్లి ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించారు. దీంతో ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు చుట్టేస్తున్నాయి. అయితే విడాకుల వార్తలపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు. కాగా అశ్రిత వృత్తిరీత్యా నటి. ఈమె ఎక్కువగా తమిళ భాషా చిత్రాలలోనే నటించింది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
దాదాపు నాలుగు సంవత్సరాలుగా
మరోవైపు మనీష్ పాండేకు దాదాపు నాలుగు సంవత్సరాలుగా క్రికెట్ జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటివరకు భారత్ తరపున 29 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మనీష్ 2021 జూలైలో శ్రీలంకపై టీమిండియా తరపున తన చివరి వన్డే ఆడాడు. 2020 డిసెంబర్ లో కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ ఆడాడు. మనీష్ వన్డేల్లో 33.29 సగటుతో 566 పరుగులు చేయగా టీ20లలో 44.31 సగటుతో 709 పరుగులు చేశాడు. ఐపీఎల్ వచ్చే సీజన్‌లో మనీష్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడనున్నాడు. అతన్ని ఫ్రాంచైజీ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది.
Also read : కెప్టెన్ రోహిత్ శర్మకు అవమానం.. పట్టించుకోని ఐసీసీ!