Champions Trophy 2025: రోహిత్‌ను తిట్టిన నోటితోనే హ్యాట్సాఫ్ అంటూ షామా పొగడ్తలు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించిన షామా మొహమ్మద్ ఛాంపియన్ ట్రోఫీ గెలవగానే మెచ్చకున్నారు. 76 పరుగులతో టీంని ముందుండి నడిపించిన రోహిత్ శర్మకు హ్యట్సాఫ్ అంటూ పొగడ్తల వర్షం కురిపింది. రోహిత్ బాడీ షేమింగ్‌పై షామా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి.

New Update
shama, rohit

న్యూజిలాండ్‌పై ఛాంపియన్ ట్రోఫీని ఇండియా సునాయాసంగా గెలిచింది. భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి మూడోసారి ట్రోఫీని సాధించింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ  76 పరుగులు చేశాడు. దాదాపు పది రోజుల క్రితం రోహిత్ శర్మను అవమానిస్తూ కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ ఆట తీరును షామా మెచ్చుకుంది. ఎక్స్‌లో టీమిండియా ప్లేయర్లపై ప్రసంశల వర్షం కురిపించింది. భారత ఇన్నింగ్స్ లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడినందుకు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ లను కూడా ఆమె అభినందించారు.

12 సంవత్సరాల తర్వాత మెన్ ఇన్ బ్లూ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుందని షామా మొహమ్మద్ పోస్ట్ చేశారు. ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకోవడంలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకు టీమిండియాకు అభినందనలు తెలిపింది. 76 రన్స్ చేసి అద్భుతంగా జట్టు ముందుండి నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మకు హ్యాట్సాఫ్ అని ట్వీట్ చేశారు.

ఇది కూడా చూడండి: HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్

మార్చి 3న మొహమ్మద్ రోహిత్ శర్మను లావుగా ఉన్నాడని బాడీ షేమింగ్ చేసింది. ఇండియన్ హిస్టరీలో ఆకట్టుకోలేని టీమిండియా కెప్టెన్‌ అని రోహిత్ శర్మను పిలిచింది. లావుగా ఉన్నాడు.. బరువు తగ్గాలి అని ఆమె అంది. కాంగ్రెస్ నాయకురాలు షామా ట్వీట్ రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. ఆమె పోస్టును బీజేపీ లీడర్లు, కేంద్ర కీడ్రా శాఖ మంత్రి ఖండించారు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా షామాపై ఫైర్ అయ్యారు. 

ఇది కూడా చూడండి: ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు