ఐపీఎల్ 2026: BCCI సంచలన నిర్ణయం.. కొత్త రూల్స్ ఇవే!

ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మ్యాచ్ జరుగుతున్న సమయంలో బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లందరూ ఇష్టమొచ్చినట్లు మైదానంలోకి రావడానికి వీల్లేదు.

New Update
ipl 2026

ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మ్యాచ్ జరుగుతున్న సమయంలో బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లందరూ ఇష్టమొచ్చినట్లు మైదానంలోకి రావడానికి వీల్లేదు. కేవలం జట్టు మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించిన 16 మంది ఆటగాళ్లు (ప్లేయింగ్ ఎలెవన్ + 5 సబ్‌స్టిట్యూట్స్) మాత్రమే గ్రౌండ్‌లోకి వెళ్లడానికి లేదా బయటకు రావడానికి అనుమతి ఉంటుంది. మిగిలిన ఆటగాళ్లు కనీసం డ్రింక్స్ లేదా బ్యాట్లు పట్టుకుని కూడా మైదానంలోకి అడుగు పెట్టకూడదని బీసీసీఐ స్పష్టం చేసింది.

కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే

కొత్త నిబంధనల ప్రకారం, బౌండరీ లైన్ దగ్గర ఒకే సమయంలో కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే ఉండాలి. సాధారణంగా బంతి బౌండరీ అవతలికి వెళ్ళినప్పుడు తెచ్చి ఇవ్వడానికి లేదా ఫీల్డర్లకు సందేశాలు పంపడానికి ఆటగాళ్లు బౌండరీ లైన్ వెనకాల తిరుగుతూ ఉంటారు. కానీ ఇకపై ఆ సంఖ్య ఐదు దాటకూడదు. మిగిలిన ప్లేయర్స్ అందరూ కచ్చితంగా డగౌట్‌కే పరిమితం కావాలి. ఎల్‌ఈడీ అడ్వర్టైజ్‌మెంట్ బోర్డుల దగ్గర అనవసరంగా తిరగడంపై కఠిన ఆంక్షలు విధించారు.

మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో క్రమశిక్షణను కాపాడటానికి, అనవసరమైన గందరగోళాన్ని తగ్గించడానికి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆటగాళ్లు డ్రింక్స్ తీసుకువెళ్తూ కెప్టెన్‌కు కోచ్ పంపిన సందేశాలను చేరవేసేవారు. ఇప్పుడు కేవలం ఆ 16 మందిలో ఉన్నవారే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల జట్ల వ్యూహాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు పూర్తి కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ టైటాన్స్ మధ్య జరగబోయే 14వ మ్యాచ్ నుండి ఈ రూల్స్ మరింత కఠినంగా అమలుకానున్నాయి.

Advertisment
తాజా కథనాలు