BCCI Job Vacancy: బీసీసీఐలో ఉద్యోగాల భర్తీ.. 60 ఏళ్ల వారు కూడా అప్లై చేయొచ్చు!

ప్రతీ ఒక్క క్రికెట్ అభిమాని టీమిండియా ప్లేయర్లను రియల్‌గా చూసి తెగ మురిసిపోతుంటారు. వారితో ఒక్క ఫొటో అయినా తీసుకోవాలని ఎంతో తహతహలాడుతుంటారు. దీనికోసం టీమిండియా మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడకు వెళ్తుంటారు. అలాంటి వారికి బీసీసీఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది.

New Update
BCCI notification

BCCI notification

BCCI Job Vacancy: ప్రతీ ఒక్క క్రికెట్ అభిమాని టీమిండియా ప్లేయర్లను రియల్‌గా చూసి తెగ మురిసిపోతుంటారు. వారితో ఒక్క ఫొటో అయినా తీసుకోవాలని ఎంతో తహతహలాడుతుంటారు. దీనికోసం టీమిండియా మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడకు వెళ్తుంటారు. అయితే అలాంటి వారికి బీసీసీఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాజాగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో సెలెక్ట్ అయిన వారు టీమిండియా ప్లేయర్ల వద్ద పనిచేయాల్సి ఉంటుంది. 

 భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బెంగళూరులోని తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కోసం ఒక 'పర్ఫార్మెన్స్ అనలిస్ట్' పోస్టును భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు భారత క్రికెట్ జట్టుతో పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే BCCI బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల ఖాళీలను ప్రకటించగా.. అదనంగా పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీని గురించి BCCI అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం అందించింది. ఈ పోస్టుకు ఫిబ్రవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read: మేడారం జాతరలో ‘కోవా బన్’ చిచ్చు.. అసలు వివాదం ఎలా, ఎందుకు మొదలైందంటే?

విధులు:

జట్లు, నిర్వహణ మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటానికి క్రికెట్‌కు సంబంధించిన అన్ని రకాల డేటాను సేకరించడం, నిర్వహించడం, విశ్లేషించడం పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ పని. ఇందులో ఆటగాళ్ల స్కోర్లు, ఫిట్‌నెస్ నివేదికలు, గాయాల హిస్టరీ, అంతర్జాతీయ ప్రమాణాల డేటాను విశ్లేషించి జట్టు మేనేజ్‌మెంట్‌కు నివేదికలు అందించాలి. ఇది జట్టు వ్యూహాలను రూపొందించడంలో సహాయపడుతుంది. 

Also Read: అమరావతికి బిల్‌గేట్స్‌.. సంజీవని, ఇతర సేవలపై ప్రశంసలు

అర్హతలు:

అనుభవం: స్పోర్ట్స్ అనలిస్ట్ లేదా డేటా సైంటిస్ట్‌గా కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి (IPL, స్టేట్ టీమ్, లేదా జాతీయ జట్లతో పనిచేసి ఉండాలి).

సాంకేతిక పరిజ్ఞానం: Microsoft Office తో పాటు, Tableau, Power BI వంటి డేటా అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్‌లపై పట్టు ఉండాలి.

వయస్సు: గరిష్టంగా 60 ఏళ్ల వయస్సు వరకు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం:

ఆసక్తి గల అభ్యర్థులు బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 27, 2026.

లోకేషన్: ఎంపికైన వారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. 

Advertisment
తాజా కథనాలు