భారత్ vs జింబాబ్వే: BCCI షెడ్యూల్ రిలీజ్!

2026 జులైలో జింబాబ్వే పర్యటనుకు సంబంధించి బీసీసీఐ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ పర్యటనలో భారత్ జింబాబ్వే భారత్ తో మూడు ట్వీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లన్నీ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ లో జరగనున్నాయి.

New Update
bcci

2026 జులైలో జింబాబ్వే పర్యటనుకు సంబంధించి బీసీసీఐ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ పర్యటనలో భారత్ జింబాబ్వే భారత్ తో మూడు ట్వీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లన్నీ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ లో జరగనున్నాయి.  ఈ సిరీస్ జూలై 23, గురువారం నాడు హరారేలో జరిగే తొలి టీ20 మ్యాచ్ తో ప్రారంభమవుతుంది. రెండవ మ్యాచ్ జూలై 25, శనివారం,  మూడవ, టీ20 జూలై 26, ఆదివారం నాడు అదే వేదికపై జరగనుంది. 

ఐదు టీ20, మూడు వన్డేలతో జూలై 19న ముగిసిన ఇంగ్లండ్‌తో వైట్-బాల్ సిరీస్‌ను పూర్తి చేసిన తర్వాత భారత జట్టు జింబాబ్వేకు బయలుదేరుతుంది. 2024లో జింబాబ్వేలో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడిన తర్వాత, టీమ్ ఇండియా మళ్ళీ ఆ దేశంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఈ తక్కువ వ్యవధి సిరీస్ ద్వారా భారత జట్టులో కొత్త ప్రయోగాలు చేసేందుకు యాజమాన్యం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో మెరిసిన యువ సంచలనాలకు ఈ పర్యటనలో చోటు దక్కే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా జింబాబ్వే పర్యటనలను యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం కల్పించే వేదికగా బీసీసీఐ ఉపయోగిస్తోంది.

జింబాబ్వే జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేసి సూపర్-8 దశకు చేరుకుంది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి దిగ్గజ జట్లను ఓడించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గడచిన కొన్నేళ్లుగా జింబాబ్వే ఆట తీరులో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. సొంత గడ్డపై భారత వంటి బలమైన జట్టును ఎదుర్కోవడానికి వారు సర్వశక్తులూ ఒడ్డుతారని భావిస్తున్నారు.

ప్రపంచకప్ దృష్టిలో ఉంచుకుని

మరోవైపు 2027 వన్డే ప్రపంచకప్ దృష్టిలో ఉంచుకుని, టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్ల పనిభారాన్ని తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ఆటగాళ్లు ఈ పర్యటనకు దూరం కానున్నారు. దీంతో ఐపీఎల్ స్టార్లకు సీనియర్ జట్టులో స్థానం సంపాదించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది. అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటి, భవిష్యత్తులో జరగబోయే పెద్ద టోర్నీలకు ఎంపికవ్వాలనే పట్టుదలతో యువ ఆటగాళ్లు ఉన్నారు.

ఇదిలా ఉండగా, జింబాబ్వే జట్టు కూడా 2027జనవరి లో మూడు వన్డేల సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఈ మూడు వన్డేలు వరుసగా కోల్‌కతా, హైదరాబాద్,ముంబైలలో జరుగుతాయి. 

Advertisment
తాజా కథనాలు