IND VS PAK: కోహ్లీ సెంచరీ కోసం ఎన్నో లెక్కలు వేశా.. అలా జరగకూడదని ప్రార్థించాను: అక్షర్ పటేల్

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీపై అక్షర్ పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ సెంచరీ కోసం ఎన్నో లెక్కలు వేశానని అన్నాడు. బ్యాటు అంచును తాకుతూ బాలు దూసుకెళ్లకూడదని తాను ప్రార్థించినట్లు పేర్కొన్నాడు.

New Update
Axar Patel interesting comments on Virat Kohli century

Axar Patel interesting comments on Virat Kohli century

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. సింగిల్ హ్యాండ్‌తో టీంను విజయ పథంలో నడిపించాడు. కోహ్లీ ఫామ్‌లో లేడు అని గగ్గోలు పెట్టిన వారికి తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. అందరూ అనుకున్నంత ఉత్కంఠగా అయితే ఈ మ్యాచ్ జరగలేదు. 

Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు

కానీ విరాట్ కోహ్లీ సెంచరీ మాత్రం కిక్రెట్ ప్రియులు, అభిమానుల్లో చెమటలు పట్టించింది. 100  పరుగులు చేస్తాడా? చెయ్యాడా? అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. విజయానికి తక్కువ స్కోర్ ఉండటంతో కోహ్లీ సెంచరీ అసాధ్యమనే అందరూ భావించారు. అందులోనూ శ్రేయస్ అయ్యర్ ఉన్నంత వరకు కోహ్లీ సెంచరీ చేస్తాడని అందరికీ ఓ నమ్మకం ఉండేది. అయితే శ్రేయస్ ఎప్పుడైతే ఔటయ్యి హార్ధిక్ క్రీజ్ లోకి వచ్చాడో అంతా ఫిక్స్ అయిపోయారు. 

Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్‌... 140 సోషల్‌ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!

హార్దిక్ రావడంతో కష్టమే

ఇక కోహ్లీ సెంచరీ కష్టమేనని భావించారు. హార్ధిక్ కూడా కోహ్లీ సెంచరీ కోసం కనికరించలేదు. ఇలా వచ్చాడో లేదో అలా పరుగులు తీశాడు. కానీ క్రీజ్‌లో అతడు ఎక్కువ సమయం నిలవలేదు. ఔటయ్యి వెనుదిరిగాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ క్రీజ్ లోకి వచ్చాడు. అతడు మెల్లి మెల్లిగా ఆడి కోహ్లీని స్ట్రైక్‌లో ఉంచాడు. అలా కోహ్లీ సెంచరీ సాధ్యం అయింది. దీనిపై అక్షర్ పటేల్ మాట్లాడాడు. 

Also Read: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!

ఎన్నో లెక్కలు వేసుకున్నా

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ కోసం తాను ఎన్నో లెక్కలు వేసుకున్నట్లు తెలిపాడు. బ్యాటు అంచును తాకుతూ బాలు దూసుకెళ్లకూడదని తాను ప్రార్థించినట్లు పేర్కొన్నాడు. చాలా సరదాగా అనిపించిందని.. తన కెరీర్‌లో ఈ స్థాయి ఒత్తిడి ఉన్న మ్యాచ్‌ను స్వయంగా క్రీజ్‌లో ఉండి చూడటం ఇదే మొదటి సారి అని తెలిపాడు. మొత్తంగా కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించాడు అని చెప్పుకొచ్చాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు