Spice Jet : స్పైస్‌ జెట్‌ కీలక నిర్ణయం...3 నెలల సెలవులు..కానీ !

స్పైస్‌జెట్ పీకల్లోతు ఆర్థిక క‌ష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.ఈ నేప‌థ్యంలోనే ఖర్చులను తగ్గించుకోవడంపై సంస్థ దృష్టిపెట్టింది.దీనిలో భాగంగా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. అందుకే వారందరిని సెలవుల నిమిత్తం పంపింది.

New Update
SpiceJet : హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్..పూర్తి వివరాలివే.!

Spice Jet : లో బ‌డ్జెట్‌ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ (Spice Jet) పీకల్లోతు ఆర్థిక క‌ష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా నష్టాలను చవిచూస్తున్న విమానయాన సంస్థ ఉద్యోగుల జీతాలు చెల్లించడం కష్టతరంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఖర్చులను తగ్గించుకోవడంపై సంస్థ దృష్టిపెట్టింది.

దీనిలో భాగంగా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. గురువారం 150 మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా మూడు నెలల పాటు సెల‌వుల్లో పంపుతున్నట్లు ప్రకటించింది. సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈమేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు.

ఈ క‌ష్ట స‌మ‌యంలో స‌హ‌క‌రిస్తున్న సిబ్బందికి సంస్థ ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసింది. ఈ ఫర్‌లాఫ్ స‌మ‌యంలోనూ ఉద్యోగుల‌ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits), ఆర్జిత సెలవుల సదు‌పాయం అలాగే ఉంటాయ‌ని తెలిపింది.

Also Read: నా మాటలు వక్రీకరించారు…సుప్రీం సీరియస్‌ అవ్వడం పై రేవంత్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు