Jaipur: సెక్యూరిటీ ఆఫీసర్‌ను చెప్పుతో కొట్టిన స్పైస్ జెట్ ఉద్యోగిని జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో అనూహ్య సంఘటన జరిగింది. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ స్క్రీనింగ్ దగ్గర జరిగిన గొడవలో సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను స్పైస్ జెట్ ఉద్యోగిని చెప్పుతో కొట్టింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. By Manogna alamuru 11 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Spice jet Employee: స్పైస్ జెట్ ఉద్యోగిని సెక్యూరిటీ అధికారిని చెప్పుతో కొట్టిన గొడవతో జైపూర్ విమానాశ్రయం హోరెత్తింది. సెక్యూరిటీ స్క్రీనింగ్‌పై దగ్గర ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తో ఉద్యోగిని గొడవ జరిగింది. ఉద్యోగిని వాహనంపై గేటు ద్వారా ఎయిర్‌పోర్టులోకి ప్రవేశిస్తుండగా.. ఆ గేటును ఉపయోగించడానికి అనుమతి లేదని ఆమెను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఉద్యోగిని వెర్షన్ మరోలా ఉంది. సెక్యూరిటీ సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించారని...లైగింక వేధింపులు చేశారని చెబుతున్నారు. ఆమోదయోగ్యం కాని పదాలను ఉపయోగించారని చెబుతున్నారు. అంతేకాదు డ్యూటీ పూర్తయ్యాక వచ్చి తనను కలవమని అడిగారని అంటున్నారు. డ్యూటీలో ఉన్న సబ్ ఇన్ప్సెక్టర్‌ను కొట్టిన కారణంగా మహిళా ఉద్యోగినిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే స్పైస్ జెట్ మాత్రం తమ ఉద్యోగికి అండగా ఉంటమని తెలిపింది. ఆమెపై లైంగిక వేధింపులు చేయడం తీవ్రమైన విషయమని..దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ ఉద్యోగికి పూర్తి సహాయ సహకారం అందిస్తామని స్పైస్‌జెట్ ప్రతినిధి వెల్లడించారు. క్యాటరింగ్ వాహన ఎస్కార్ట్ స్టీల్ గేట్ నుంచి వెళ్లే అవకాశం ఉందని.. అందుకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే విమానాశ్రయ పాస్‌లు ఉన్నాయని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. అయినా కూడా భద్రతా సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఆపినట్లు తెలిపారు. A SpiceJet employee was arrested on Thursday after she slapped a Central Industrial Security Force (CISF) officer during an argument over security screening. Anuradha Rani, a food supervisor with SpiceJet, was entering the airport along with other employees through the vehicle… pic.twitter.com/mhgB7MMyUg — IndiaToday (@IndiaToday) July 11, 2024 Also Read:Andhra Pradesh: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీలు… #airport #spice-jet #jaipur #security-officer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి