Inter Supplementary Exams: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.
Also Read : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.
Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!
Also Read : అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో