టమాటాల ధర తగ్గాలని.. 508 టమాటాలతో అమ్మవారికి పూజ

తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని కురుకుడిలోని ప్రముఖ ఆలయాలుగా పేరొందిన మహా మరియమ్మన్, నాగమ్మన్ గుడికి భక్తులు నలుమూలల నుంచి వస్తూంటారు. ప్రస్తుతం ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది భక్తులు టమాటాల ధరలు తగ్గాలని మొక్కుకున్నారు. ప్రత్యేకంగా 508 టమాటాలతో మాల తయారు చేసి అమ్మవారి మెడలో వేశారు. అమ్మవారికి మెడలో వేసిన టమాటాలను భక్తులకు ప్రసాదంగా పూజారులు..

New Update
టమాటాల ధర తగ్గాలని.. 508 టమాటాలతో అమ్మవారికి పూజ

టమాటా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పెరిగిన టమాటా ధరలతో వాటిని వాడాలంటేనే జనం భయపడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. సగానికి సగం మంది అయితే అసలు టమాటాలను కొనడమే మానేశారు. వాటివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. టమాటాలతో కొంతమంది వాటిని క్యాష్ కూడా చేసుకుంటున్నారు. అలాగే టమాటాల కోసం దొంగతనాలు, దోపిడీలు కూడా జరుగుతున్నాయి.

ఈక్రమంలోనే టమాటాల ధరలు తగ్గేలా చూడాలంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణంగా సంతానం, విద్య, ఆరోగ్యం, ఆర్థిక కష్టాలు తీర్చాలంటూ ఆలయాల్లో పూజలు చేస్తారు. కానీ కొండలా పెరిగిపోతున్న టమాటాలను కొనలేకపోతున్నామని కొంతమంది భక్తులు పూజలు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టణం జిల్లా జరిగింది.

జిల్లాలోని కురుకుడిలోని ప్రముఖ ఆలయాలుగా పేరొందిన మహా మరియమ్మన్, నాగమ్మన్ గుడికి భక్తులు నలుమూలల నుంచి వస్తూంటారు. ప్రస్తుతం ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది భక్తులు టమాటాల ధరలు తగ్గాలని మొక్కుకున్నారు. ప్రత్యేకంగా 508 టమాటాలతో మాల తయారు చేసి అమ్మవారి మెడలో వేశారు. అమ్మవారికి మెడలో వేసిన టమాటాలను భక్తులకు ప్రసాదంగా పూజారులు పంచి పెట్టారు. ప్రస్తుతం ఈ వార్త, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే రానున్న రోజుల్లో టమాటా ధర కిలో రూ.300కి చేరే అవకాశం ఉందని, మిగతా కాయగూరల ధరలు కూడా పెరుగుతాయని హోల్ సేల్ వ్యాపారులు చెబుతున్నారు. దీంతో జనం మరింత భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కిలో రూ.160 నుంచి రూ.250కి పలుకుతోంది. పంట అధికంగా పండే ప్రాంతాల్లో ముందు ఎండలు, తర్వాత భారీ వర్షాల కారణంగా.. టమాటాల సరఫరాలో అంతరాయాల వల్ల ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు