Sovereign Gold Bond : బంగారం చౌకగా ఇలా కొనండి.. ఐదు రోజులే అవకాశం.. మిస్ కావద్దు..! ప్రభుత్వం నాలుగో సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 12 నుంచి అందుబాటులోకి తెస్తోంది. 24 క్యారెట్ల గ్రాము బంగారం రేటు రూ.6,263గా నిర్ణయించారు. ఆన్ లైన్ లో దీనికి 50 రూపాయల తగ్గింపు ఉంటుంది. By KVD Varma 11 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Sovereign Gold Bond : నాల్గవ సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి వస్తోంది. ఈ సిరీస్ సోమవారం అంటే ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ గోల్డ్ బాండ్‌లో గ్యారెంటీడ్ రిటర్న్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, కొంతమందికి డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి డిజిటల్‌గా చెల్లింపులు చేసే వారికి ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఈ మొత్తం పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 12 నుండి 16 వరకు అందుబాటులో.. గవర్నమెంట్ గోల్డ్ బాండ్ (SGB) సోమవారం నుండి ఐదు రోజుల పాటు(Sovereign Gold Bond) ఓపెన్ లో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈసారి బంగారం ఇష్యూ ధర గ్రాముకు రూ.6,263గా నిర్ణయించారు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీరు హామీతో కూడిన రాబడిని కూడా పొందుతారు. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం బంగారు బాండ్లకు డిమాండ్ పెరుగుతోంది. అలాగే ప్రతిసారీ దీనికి మంచి స్పందన వస్తుంది. వీరికి తగ్గింపు లభిస్తుంది.. బాండ్ ధర గ్రాము బంగారం రూ.6,263 అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపులు చేసే పెట్టుబడిదారులకు ఇష్యూరేట్ నుండి గ్రాముకు 50 రూపాయల తగ్గింపు ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి ఇన్వెస్టర్లకు గోల్డ్ బాండ్ల ఇష్యూ ధర రూ.6,213గా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. గోల్డ్ బాండ్లను ఇలా కొనుగోలు చేయవచ్చు.. SGBలను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు, పేమెంట్స్ బ్యాంక్‌లు , రీజినల్ రూరల్ బ్యాంక్‌లు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SHCIL), సెటిల్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL), పోస్టాఫీసులు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్, BSE లిమిటెడ్ ల వద్ద సావరిన్ గోల్డ్ బాండ్స్ ఆఫ్ లైన్ లో కొనవచ్చు. Also Read : ఇంటి రెంటల్ ఎగ్రిమెంట్ 11 నెలలకే ఎందుకు చేస్తారు? గోల్డ్ బాండ్లను ఎవరు.. ఎంత కొనుగోలు చేయవచ్చు? వాస్తవానికి భారత ప్రభుత్వం తరపున సెంట్రల్ బ్యాంక్ బంగారు బాండ్ల(Sovereign Gold Bond) ను ఇష్యూ చేస్తుంది. నివాసితులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUF), ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే వీటిని విక్రయించవచ్చు. గరిష్ట సబ్‌స్క్రిప్షన్ పరిమితి వ్యక్తులకు 4 కిలోలు, HUFకి 4 కిలోలు, ట్రస్టులు,సారూప్య సంస్థలకు ఆర్థిక సంవత్సరానికి 20 కిలోలు కొనుగోలు పరిమితి ఉంటుంది. బంగారం కోసం భౌతిక డిమాండ్‌ను తగ్గించాలనే ఉద్దేశ్యంతో గోల్డ్ బాండ్ పథకాన్ని నవంబర్ 2015లో తొలిసారిగా ప్రవేశపెట్టారు. 8 సంవత్సరాలకు ముందు బాండ్ అమ్మితే టాక్స్.. సావరిన్ మెచ్యూరిటీ వ్యవధి 8 సంవత్సరాలు. మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత, దాని ద్వారా వచ్చే లాభాలపై పన్ను ఉండదు. మీరు మీ డబ్బును 5 సంవత్సరాల తర్వాత ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. కానీ, అలా చేస్తే మాత్రం దాని నుండి వచ్చే లాభం దీర్ఘకాలిక మూలధన లాభం(LTCG) కింద పరిగణిస్తారు. అప్పుడు దానిపై 20.80% పన్ను విధిస్తారు. Also Read : మూడోవంతు డీమ్యాట్ ఎకౌంట్స్ కి నామినీలు లేరు.. Watch this Interesting Video : #gold-bonds #sovereign-gold-bond #sgb #shcil మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి