South Korea: గొడ్డు మాంసంతో బియ్యం.. వరికంటే 8 శాతం అధిక ప్రొటీన్‌!

దక్షిణ కొరియాలోని సియోల్‌లోని యోన్సీ విశ్వవిద్యాలయంలో కొత్త రకం హైబ్రిడ్ రైస్‌ను అభివృద్ధి చేశారు. గొడ్డు మాంసం కండరాల కొవ్వు కణాలతో మిళితమైన ఉన్న బియ్యం తయారు చేశారు. వరికంటే ఇందులో ప్రొటీన్‌ 8 శాతం ఎక్కువగా ఉంటుదని పేర్కొన్నారు. సైనికులు, వ్యోమగాములకు బాగా పనికొస్తాయన్నారు.

New Update
South Korea: గొడ్డు మాంసంతో బియ్యం.. వరికంటే 8 శాతం అధిక ప్రొటీన్‌!

Hybrid rice: ఆహార సంక్షోభం మధ్య దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రిడ్ రైస్‌ను అభివృద్ధి చేశారు. సియోల్‌లోని యోన్సీ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రయోగశాలలో కొత్త ధాన్యాన్ని పెంచారు. ఇది పూర్తిగా గొడ్డు మాంసం కండరాలు కొవ్వు కణాలతో మిళితమై ఉన్నట్లు వారు వెల్లడించారు.

8 శాతం అధిక ప్రొటీన్‌..
ఈ మేరకు సాధారణ వరి వంగడాలతో పోలిస్తే ఇందులో ప్రొటీన్‌ 8 శాతం ఎక్కువగా ఉంటుదని, ఈ పోషక పదార్థంతో కూడిన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో వినియోగించడం వినూత్న మార్గమని శాస్త్రవేత్తలు చెప్పారు. సాధారణ రకాలకు భిన్నంగా ఉండే ఈ బియ్యంను కరవులో, సైనికులు, రోదసిలోని వ్యోమగాములకు ఆహారంగా బాగా పనికొస్తాయని తెలిపారు. మాంసాహారంతో పోలిస్తే ఈ తరహా వరి ఉత్పత్తి వల్ల పర్యావరణానికి తక్కువ హానీ జరుగుతుందని, ఈ ధాన్యం రూపంలో 100 గ్రాముల ప్రొటీన్‌ ఉత్పత్తి చేస్తే 6.27 కిలోల కార్బన్‌ డైఆక్సైడ్‌ వెలువడుతుందని పరిశోధకులు తెలిపారు.

ఇది కూడా చదవండి : Delhi: అదే మా మూలసూత్రం.. మూడోసారి గెలుపుపై అనుమానం లేదు: మోడీ

సహజ ధాన్యాల కంటే దృఢం..
అలాగే సంప్రదాయ పశు మాంసం ఉత్పత్తి వల్ల 49.89 కిలోల మేర ఈ హానికర వాయువు వాతావరణంలోకి చేరుతుందని పేర్కొన్నారు. ఈ 'సాధారణ బియ్యం ఇప్పటికే పోషక స్థాయిలను కలిగివున్నాయి. కానీ పశువుల కణాలను కలిపిన బియ్యం మరిన్ని పోషకాలను అందిస్తాయి' అని శాస్త్రవేత్తలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్పత్తిలో సాధారణ బియ్యం కంటే 8 శాతం ఎక్కువ ప్రొటీన్, 7 శాతం ఎక్కువ కొవ్వు ఉంటుంది. సహజ ధాన్యాల కంటే దృఢంగా, పెళుసుగా ఉంటుందని బృందం తెలిపింది.

చౌకైన ధరలకే..
ప్రతి 100g (3.5 ఔన్సులు) ప్రొటీన్ ఉత్పత్తికి, హైబ్రిడ్ బియ్యం 6.27 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుందని అంచనా వేశారు. అయితే గొడ్డు మాంసం ఉత్పత్తి ఎనిమిది రెట్లు ఎక్కువగా విడుదలవుతుందని పత్రికా ప్రకటనలో పేర్కొంది. కొరియాలోని వినియోగదారులకు ఇవి చాలా చౌకైన ధరలకే లభిస్తాయని తెలిపారు. ఇక్కడ హైబ్రిడ్ బియ్యం కిలోకు సుమారు $2.23 ఖర్చు అయితే.. గొడ్డు మాంసం ధర దాదాపు $15 ఉంది. బియ్యం మార్కెట్‌లోకి వెళ్లే ముందు ఈ ప్రక్రియను మరింత అభివృద్ధి చేయాలని బృందం యోచిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు